టాలీవుడ్ సరికొత్త సెన్సేషన్… రాగ్ మయూర్

ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చెప్పడం సాధ్యం కాదు. ప్రేక్షకుల అభిరుచి ఎప్పుడు ఎలా మారుతుందో అంత ఈజీగా కనిపెట్టలేం. స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడం కామన్. కానీ, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, కేవలం తన యాక్టింగ్ తో టోటల్ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు ఒక యంగ్ హీరో. అతనే రాగ్ మయూర్. ఇటీవల విడుదలైన గరివిడి లక్ష్మి చిత్రంలో రాగ్ మయూర్ పోషించిన పాత్ర పేరు సత్తిబాబు. ఇదొక పక్కా లోకల్, రూటెడ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో రాగ్ మయూర్ కేవలం నటించలేదు.. పూర్తిగా జీవించేశాడు అని చెప్పాలి. ఒకే సినిమాలో, ఒకే మనిషిలో ఐదు రకాల డిఫరెంట్ డైమెన్షన్స్ చూపిస్తూ ఆడియన్స్‌కు ఒక సాలిడ్ యాక్టింగ్ ట్రీట్ ఇచ్చాడు. ఒక సీన్ లో నవ్విస్తాడు, మరో సీన్ లో ఏడిపిస్తాడు, ఇంకో సీన్ లో భయపెడతాడు. కథ ప్రకారం క్యారెక్టర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ దానికి తగ్గట్లుగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకున్న తీరు అద్భుతం. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక రకమైన బాడీ లాంగ్వేజ్, మిడిల్ ఏజ్ కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ లో వచ్చే మెచ్యూరిటీ, వయసు పైబడిన తర్వాత నడకలో, చూపుల్లో వచ్చే మార్పు.. ఇలా ప్రతి స్టేజ్ లోనూ లుక్స్ పరంగా అతను చేసిన మేకోవర్ చూస్తే కచ్చితంగా వావ్ అనాల్సిందే. మేకప్ మాత్రమే కాదు, కళ్ళలో ఎక్స్ప్రెషన్స్ తో అతను పండించిన హావభావాలు అచ్చం కమల్ హాసన్ ని గుర్తుచేస్తున్నాయి అని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యంగ్ యాక్టర్ ఇంత బరువైన, వేరియేషన్స్ ఉన్న పాత్రను తన భుజాలపై వేసుకుని నడిపించడం నిజంగా గ్రేట్.
ఇక ఈ సినిమాలో అందరినీ అత్యంత ఆశ్చర్యపరిచిన మరో విషయం.. డైలాగ్ డెలివరీ. ఒక ప్రాంతీయ యాసలో, ముఖ్యంగా శ్రీకాకుళం స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. కాస్త తేడా వచ్చినా అది చాలా ఆర్టిఫిషియల్ గా, వెటకారంగా అనిపిస్తుంది. కానీ రాగ్ మయూర్ ఆ కష్టమైన స్లాంగ్‌ను ఎక్కడా ఆర్టిఫిషియల్‌గా అనిపించకుండా చాలా నేచురల్ ఫ్లోలో డెలివరీ చేశాడు. ఆ యాసను పట్టుకోవడానికి అతను తెర వెనుక ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నెలల పాటు ఆ ప్రాంతం వారితో కలిసి గడిపాడో తెర మీద ప్రతి ఫ్రేమ్ లోనూ స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. అసలు తెర మీద మనకు డబ్బింగ్ చెబుతూ కనిపిస్తున్నది యాక్టర్ రాగ్ మయూరా లేక రియల్ సత్తిబాబా అనే డౌట్ వచ్చేంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన మార్క్ చూపించాడు. ఎమోషనల్ సీన్స్ లో అతను ఆ శ్రీకాకుళం యాసలో ఏడుస్తూ డైలాగ్స్ చెబుతుంటే థియేటర్లో ఆడియన్స్ భావోద్వేగానికి లోనయ్యారంటే ఏ రేంజ్ లో నటించాడో అర్థం చేసుకోవచ్చు.



