నయనతార ప్రధాన పాత్రలో ‘మహాశక్తి’...విడుదలైన ట్రైలర్

అటు గ్లామర్ పాత్రలతో పాటు మహిళా ప్రాధాన్యమున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అదరగొడుతూ రెండు దశాబ్దాలుగా స్టార్ నటీమణిగా అలరిస్తున్నారు నయనతార. తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. అందంతోనే కాకుండా నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె నుండి కొత్త సినిమా వస్తుందంటే పెద్ద హీరోలకు ధీటుగా అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. కమర్షియల్ సినిమాల్లో కథానాయకుడి పక్కన నటిస్తున్నా, తన పాత్రకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉండేలా చూసుకోవడం ఆమె స్టైల్.
సౌత్ ఇండియాలో స్టార్ హీరోల సినిమాలకు ఏ స్థాయిలో హైప్, క్రేజ్ ఉంటాయో, నయనతార ప్రధాన పాత్రలో నటించే చిత్రాలకు కూడా అంతే స్థాయి ఆదరణ దక్కుతుంది. తన అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్, వైవిధ్యమైన నటనతో ఎలాంటి పాత్రలోనైనా జీవించగలగడం వల్ల ఆమెకు భారీ సంఖ్యలో అభిమాన గణం ఏర్పడింది. ప్రస్తుతం కూడా ఆమె వరుస ప్రాజెక్ట్‌లతో తన విజయపరంపరను కొనసాగిస్తున్నారు. కథలో బలం ఉన్న ప్రతిష్టాత్మక చిత్రాలను ఎంచుకుంటూ, కొత్త దర్శకులను కూడా ప్రోత్సహిస్తున్నారు. నయన్ నటిస్తున్న ప్రతి కొత్త చిత్రం విడుదలపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంటుంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలోనూ అదే క్రేజ్ మరియు ఇమేజ్ను కాపాడుకుంటూ, భారతీయ సినీరంగంలో తనకంటూ ఒక చెరగని అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఇక తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో సినిమా నుండి అప్డేట్ వచ్చేసింది. నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'మూకుత్తి అమ్మన్ 2' నుండి ఈ ట్రైలర్ వచ్చింది. తెలుగులో 'మహాశక్తి'గా రానుంది. సుందర్.సి తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 6న విడుదల కానుంది. అమ్మవారి పాత్రలో నయనతార కనిపించనున్నారు. దునియా విజయ్, రెజీనా, ఊర్వశి, యోగిబాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే నయనతార రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా తెరకెక్కించారు. నటీనటుల నటన నిర్మాణ విలువలు ప్రేక్షకులకు ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అందించే స్టాండర్డ్ లో ఉన్నాయి. మరి ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.



