న్యూజిలాండ్ టూర్.. విజయంతో బోణీ కొట్టిన భారత్…మొదటి టీ 20లో థ్రిల్లింగ్ విక్టరీ

న్యూజిలాండ్ లో భారత జట్టు పర్యటనను విజయంతో మొదలుపెట్టి శుభారంభం చేసింది. భారీ స్కోరింగ్ మ్యాచ్ లో భారత్ గెలిచి సత్తా చాటింది. హ్యగ్లే ఓవల్, క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్ (40; 8x4, 3x6) కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఫిన్ అలెన్ 45 (24; 5x4, 2x6), బెవోన్ జాకోబ్ 31 (16; 3x6), డారైల్ మిచెల్ 28 (19; 2x4, 1x6), టిమ్ సీఫర్ట్ 24 (17; 3x4, 1x6) పరుగులు చేశారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, అక్సర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లు 10 అంతకంటే ఎక్కువ పరుగులు ఎకనామితో బౌలింగ్ చేశారు.
ఇక టార్గెట్ ఛేజింగ్ లో భారత్ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. మొదటి వికెట్ కు సంజూ శాంసన్ 67 (33; 8x4, 4x6), అభిషేక్ శర్మ 29 (12; 2x4, 3x6) 93 పరుగులు జోడించారు. కెప్టెన్ అందరూ సర్పంచ్ సాబ్ అని పిలుచుకునే శ్రేయాస్ అయ్యర్ 42 (28; 1x4, 2x6) కీలక సమయంలో పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ (1), తిలక్ వర్మ (6) విఫలమయ్యారు. అక్సర్ పటేల్ (24) పరుగులతో పర్వాలేదనిపించాడు.నమన్ ధీర్ 42 నాటౌట్ (15; 5x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ తో భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ 5 మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కివీస్ బౌలర్లలో మైఖేల్ బ్రేస్ వెల్ 2 వికెట్లు, మిచెల్ శాంట్నర్ 2 వికెట్లు, ఫెర్గుసన్, ఆడమ్ మిల్నే ఒక్కో వికెట్ తీశారు.
మొదటి మ్యాచ్ లోనే అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. పరుగుల వరద పారిన ఉత్కంఠ పోరులో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఇన్నింగ్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇక భారత ఇన్నింగ్స్ కూడా న్యూజిలాండ్ కు ధీటుగా నిలిచి పైచేయి సాధించింది. మిడిల్ ఓవర్లలో ఇషాన్ కిషన్ (1), తిలక్ వర్మ (6) త్వరగానే నిష్క్రమించినప్పటికీ, 'సర్పంచ్ సాబ్'గా గుర్తింపు పొందిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (42) సమయోచితంగా ఆడాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా 24 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ చెరో 2 వికెట్లు తీశారు. చివర్లో మ్యాచ్ భారత చేతుల నుండి జారిపోకుండా నమన్ ధీర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచి మరో రెండు బాల్స్ మిగిలిఉండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సూపర్ ఫినిషింగ్‌తో భారత్ సిరీస్‌లో శుభారంభం చేసింది.



