ఫ్యామిలీ ఆడియెన్స్‌కి పండగే.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ గ్రాండ్ రిలీజ్‌కి ముహూర్తం ఖరారు!
కామెంట్లు (0)

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సీనియర్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్ హీరోగా చేస్తోన్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’ హౌస్ నెం.47. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. చినబాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల తేదీని మార్చుకుంటూ వాయిదా పడిన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్న సమయంలో తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈరోజు విజయదశమి సందర్భంగా హీరో వెంకటేష్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక ఆసక్తికర పోస్టర్ ను షేర్ చేశారు. రెండు దశాబ్దాల తర్వాత శ్రీనుతో మళ్లీ కలిసి పనిచేయడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. వినోదం, యాక్షన్‌తో పాటు మరెన్నో ఆకట్టుకునే అంశాలతో ప్రేక్షకుల ముందుకు ఒక సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని తీసుకురాబోతున్నాం అంటూ వెంకీ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇంతక ముందు వెంకటేష్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘వాసు’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేశారు. ఆ సినిమాలను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు టీవీలలో చూస్తూ కడుపుబ్బా నవ్వుకుంటూనే ఉంటారు. అంతలా వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో ఎంటర్టైన్మెంట్ ను కోరుకునే ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వెంకీ కామెడీ టైమింగ్ ను చూసి ఆనందించాలని ఎదురుచూస్తున్నారు. శ్రీనిధి శెట్టి, నివేద పేతురేజ్, నారా రోహిత్, రఘుబాబు, సత్య తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
వివిధ కారణాల వల్ల ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని సినీ ప్రియులు, అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటూ ఎదురుచూశారు. ఆ ఉత్కంఠకు తెరదించుతూ చిత్ర యూనిట్ తాజాగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. త్రివిక్రమ్ దర్శకత్వ శైలిలో వెంకీ కామెడీ టైమింగ్‌ను మరోసారి థియేటర్లలో చూసి ఆనందించడానికి అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.



