బెడ్రూమ్ లో దెయ్యం..బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
కామెంట్లు (0)

ఇటీవల ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్ కు వెళ్లిన సల్మాన్.. తన పడకగదికి సంబంధించిన ఒక షాకింగ్ అండ్ భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. తెర మీద వందల మంది విలన్లను ఒంటిచేత్తో మట్టికరిపించే ఈ సూపర్ స్టార్ రియల్ లైఫ్‌లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం, లేదా సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తూనే ఉంటుంది. ఈసారి ఆ షోలో సందడి చేసిన సల్మాన్ ఖాన్.. తన గతం గురించి, తాను ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్స్ గురించి ముచ్చటించారు. కరణ్ జోహార్ కుచ్ కుచ్ హోతా హై సినిమా కథ చెప్పడానికి మొదటిసారి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన రోజులను సల్మాన్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను చాలా చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాడినని చెబుతూనే, ఒక షాకింగ్ పారానార్మల్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నారు. తాను ఆ గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్న సమయంలో.. తన పడకగదిలో ఎప్పుడూ ఒంటరిగా ఉన్నట్లు అనిపించేది కాదని, తనతో పాటు ఎప్పుడూ మరొక అదృశ్య శక్తి ఉన్నట్లు తనకు బలంగా అనిపించేదని సల్మాన్ చెప్పడం విస్మయానికి గురిచేసింది. బెడ్ రూమ్ లో ఎప్పుడూ వింత వింత శబ్దాలు వచ్చేవి. నేను స్నానానికి బాత్రూమ్లోకి వెళ్తే చాలు.. నా బెడ్రూమ్లో కబోర్డ్స్ వాటంతట అవే మూసుకోవడం, తెరుచుకోవడం లాంటి శబ్దాలు నాకు స్పష్టంగా వినిపించేవి. నేను స్నానం చేసి గదిలోంచి బయటకు రాగానే.. రూమ్‌లో ఉన్న లైట్స్ వాటంతట అవే ఆఫ్ అయ్యేవి. అంతేకాకుండా, నేను ఆన్ చేయకుండానే, నాకు తెలియకుండానే నా మ్యూజిక్ సిస్టంలో వాటంతట అవే పాటలు ప్లే అయ్యేవి అంటూ సల్మాన్ తన భయంకరమైన అనుభవాలను వివరించాడు. తనను ఎప్పుడూ ఎవరో ఫాలో అవుతున్నట్లు, అనుకరిస్తున్నట్లు అనిపించేదని చెప్పారు. అయితే మరి ఇన్ని జరుగుతున్నా ఆ కండల వీరుడు ఎందుకు భయపడలేదు? నిజంగానే అది దెయ్యమా అని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సల్మాన్ చాలా కూల్‌గా ఆన్సర్ ఇచ్చాడు. ఆ అదృశ్య శక్తి ఎవరో తాను ఎప్పుడూ డైరెక్ట్‌గా, ప్రత్యక్షంగా చూడలేదని.. అది దెయ్యమా లేక ఇంకేదైనా పారానార్మల్ శక్తా అనేది తనకు కూడా కచ్చితంగా తెలియదని సల్మాన్ అన్నాడు. దీనికి కాస్త తనదైన బ్రాండ్ హాస్యాన్ని జోడిస్తూ.. ఒకవేళ నాతో పాటు ఆ రూమ్‌లో ఉన్న ఆ అదృశ్య శక్తి కనక ఒక అమ్మాయి అయితే, కనీసం ఒక్కసారైనా నాకు కనిపించు ప్లీజ్ అని నేను దాన్ని సరదాగా అడిగేవాడిని అని సల్మాన్ చెప్పడంతో ఆ షోలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.
ఇక దెయ్యాల సంగతి పక్కన పెడితే.. సల్మాన్ సినిమాల లైనప్ మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్లో మాతృభూమి అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు దక్షిణాదిలో తన మార్క్ వేసేందుకు, డైరెక్ట్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సల్మాన్ సిద్ధమయ్యాడు. మన టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సల్మాన్ ఖాన్ సరసన సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. నయనతార-సల్మాన్ ఖాన్ కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



