భువి వచ్చేస్తున్నాడు…బెంగళూరు టీ 20లో పునరాగమనం
కామెంట్లు (0)

భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘకాలం తరువాత జట్టులోకి పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత ముందుగానే అతను కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. భువనేశ్వర్ ను ముందుగా న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ (2026) కోసం భారత జట్టుకు ఎంపిక చేశారు. 2022 నవంబర్ లో చివరిసారిగా భువనేశ్వర్ కుమార్ భారత్ తరపున న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి బ్లూ జెర్సీలో కనిపించనున్నాడు. ఇటీవల హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ గాయపడ్డాడు. భుజానికి గాయమైంది. అతనిని చివరిదైన 5వ టీ 20కి కొనసాగిస్తూనే భువనేశ్వర్ కుమార్ కు కూడా అవకాశం కల్పిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ 5వ టీ 20 జరగనుంది.
ఐపీఎల్ లో భువి ఈ స్టేడియంలో మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో తనకు కలిసొచ్చిన ఈ మైదానంలోనే పునరాగమనం చేస్తుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తనదైన స్వింగ్ బౌలింగ్ తో తన పునరాగమనంలో అదరగొడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్ లలో 2 భారత్, 2వెస్టిండీస్ గెలిచి 2-2తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మకమైన 5వ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. బౌలర్ల ప్రదర్శనపై ఆందోళన నెలకొంది. మరీ ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. మ్యాచ్ లలో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఛేజింగ్ లు కూడా రికార్డు స్థాయిలో నమోదు కావడం కనిపిస్తోంది. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తే భారత్ సిరీస్ ను కైవసం చేసుకోవచ్చు. అటు వెస్టిండీస్ కూడా అత్యున్నతంగా రాణిస్తోంది. బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు. చిన్నస్వామి స్టేడియంలో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ ను గెలిచి ఆతిథ్య భారత్ సిరీస్ ను నిలుపుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
భారత జట్టు :
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్.



