మెగాస్టార్ న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా…దుమ్ములేపనున్న ’కాకా’
కామెంట్లు (0)

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం విడుదలైన ప్రాంతీయ సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇది నిలిచింది. ఇక 2027 సంక్రాంతికి ‘కాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది మెగాస్టార్-బాబీ కలయికలో రెండో సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ‘కాకా’ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అనశ్వర రాజన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మెగాస్టార్ కు సంబంధించిన మరో లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ లుక్ ట్రెండింగ్ లో ఉంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. సునీల్, నివేద పేతురాజ్ అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2027 జనవరి 13న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉండేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్‌కు, బాబీ వినూత్న దర్శకత్వ ప్రతిభ తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలను అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మరియు ఎమోషనల్ సీన్లు కథకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. అలాగే ఎస్.ఎస్. థమన్ అందిస్తున్న మాస్ బిజీఎమ్స్, పాటలు థియేటర్లలో అభిమానులను ఊపేస్తాయని మరోసారి మెగాస్టార్ మాస్ యాక్టింగ్ తో అన్ని వర్గాలను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నటీనటుల నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
సంబంధిత వార్తలు

ఫ్యామిలీ ఆడియెన్స్‌కి పండగే.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ గ్రాండ్ రిలీజ్‌కి ముహూర్తం ఖరారు!

పెళ్లి తర్వాత ఫస్ట్ సినిమా…విరోష్ కు స్పెషల్ మైల్ స్టోన్…ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

