యాక్షన్ మోడ్ ఆన్…అక్క వచ్చేస్తోంది!
కామెంట్లు (0)

అందంతో పాటు అద్భుతమైన నటనతో ఆడియన్స్ను కట్టిపడేసే టాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేశ్. పెళ్లి అయిన తర్వాత ఈ క్యూటీ వరుస ప్రాజక్టులతో ఫుల్ బిజీ అయిపోయింది. అయితే తాజాగా తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కు కీర్తి డబుల్ ట్రీట్ ఇచ్చింది. ఒకవైపు వెంకటేష్ తో నటిస్తున్న మూవీ నుంచి అప్డేట్ రాగా, మరోవైపు కీర్తి సురేశ్ లీడ్ రోల్ లో నటిస్తున్న అక్క వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యి దుమ్మురేపుతోంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్లో కీర్తి సురేశ్ తో పాటు బాలీవుడ్ టాలెంటెడ్ నటి రాధికా ఆప్టే కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇద్దరు పవర్ ఫుల్ లేడీస్ కలిసి నటిస్తున్న ఈ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బర్డ్ డే సందర్భంగా ఆమె అభిమానులకు వరుస అప్డేట్లతో పండగలాంటి వాతావరణం నెలకొంది. ఇప్పటికే వెంకీ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రాగా, తాజాగా ఆమె నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రివెంజ్ యాక్షన్ సిరీస్ అక్క టీజర్ను మేకర్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్నారు.
ధర్మరాజ్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన అక్క సిరీస్ 1980ల కాలం నాటి పెర్నూరు అనే రాజ్యం నేపథ్యంతో సాగుతుంది. తరతరాలుగా మహిళలే పరిపాలించి, రక్షించిన ఆ సామ్రాజ్యంలో అధికారం, సాంప్రదాయాలు, కక్షల చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఇక కీర్తి సురేశ్ ఇందులో భవాని అనే పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తోంది. రుద్ర పాత్రలో వర్సటైల్ యాక్ట్రెస్ రాధికా ఆప్టే నటిసోంది. ఈ సిరీస్ లో మాత్రం ఆమె ఫుల్ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. టీజర్ చూస్తుంటే ఈ సిరీస్ లో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉన్నాయని అర్థమవుతోంది. టీజర్ చూస్తుంటే కీర్తి సురేశ్, రాధికా ఆప్టేల క్యారెక్టర్స్ చాలా వైల్డ్ గా, పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ సిరీస్ పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సిరీస్ లకు, సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను భారీ బడ్జెట్ తో, హై క్వాలిటీతో నిర్మించింది. ఈ పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 30 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది.



