రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ..ఎక్కడ..? ఎప్పుడంటే..?
కామెంట్లు (0)

రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో యూత్ ఫుల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మంథన తెరకెక్కిన భారీ చిత్రం ‘రణబాలి’ తాజాగా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన కనిపిస్తోంది. థియేటర్లలో ఈ సినిమా రచ్చ చేస్తుండగానే.. మరోవైపు ఓటీటీ లవర్స్ కు ఒక అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. విజయ్ దేవరకొండ కెరీర్లోనే రణబాలి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. స్వాతంత్ర్య పూర్వపు నేపథ్యంలో, బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ మునుపెన్నడూ కనిపించని విధంగా చాలా పవర్ఫుల్ అండ్ అగ్రెసివ్ రోల్లో రణబాలిగా తన నటనతో అదరగొట్టేశాడు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సినిమాకు మేజర్ హైలైట్గా నిలిచాయి. ఇక ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక మందన్న ఒదిగిపోయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ పాత్రలో రష్మిక తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేసింది. రియల్ లైఫ్ కపుల్ కావడంతో స్క్రీన్ మీద వీరిద్దరి కెమిస్ట్రీ చాలా సహజంగా, అద్భుతంగా పండింది. వీరిద్దరితో పాటు ఈ సినిమాకు అసలైన ప్రాణం పోసింది హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లో . ది మమ్మీ లాంటి హాలీవుడ్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈ సినిమాలో బ్రిటిష్ దొరగా చాలా క్రూరమైన విలన్ పాత్రలో కనిపించారు. విజయ్ దేవరకొండ , ఆర్నాల్డ్ వోస్లో మధ్య వచ్చే మైండ్ బ్లోయింగ్ ఫేస్-ఆఫ్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో గూస్బంప్స్ తెప్పిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ టి-సిరీస్ కలిసి ఎక్కడా రాజీ పడకుండా వందల కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తెరకెక్కించాయి.



