200 మంది అమ్మాయిలతో సూపర్ స్టార్ మాస్ స్టెప్స్..కట్ చేస్తే జరిగింది ఇది..!

అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్ 2’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, అనిరుధ్ మ్యూజిక్, అన్నింటికి మించి సూపర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ, థియేటర్ నుంచి బయటకు వస్తున్న రజనీ ఫ్యాన్స్ కు మాత్రం ఒక చిన్న అసంతృప్తి, ఒక భారీ నిరాశ మిగిలిపోయింది. అదే అలా బోలేలో స్పెషల్ సాంగ్. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ఈ సాంగ్ పై విపరీతమైన హైప్ ఏర్పడింది. తీరా థియేటర్ కు వెళ్తే ఆ పాట ఎక్కడా కనిపించలేదు.
జైలర్ 2 మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా, అలా బోలేలో పాటను మేకర్స్ ఆగస్టు నెలలోనే ఫస్ట్ సింగిల్‌గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. రాక్ స్టార్ అనిరుధ్ మ్యూజిక్ కంపోజిషన్‌తో పాటు స్వయంగా పాడిన ఈ ఎనర్జిటిక్ పాటకు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అద్భుతమైన స్టెప్పులు కంపోజ్ చేశారు. తెలుగు వెర్షన్ కు శ్రీకాంత్ శ్రీనివాస మౌళి క్యాచీ లిరిక్స్ అందించారు. ఇక ఈ మాస్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ నంబర్లో నటి పూర్ణ తనదైన ఎక్స్ప్రెషన్స్, మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది. కానీ ఆ లిరికల్ వీడియోలో పూర్ణ స్టెప్పులు, విజువల్స్ చూపించారు తప్ప, సూపర్ స్టార్ రజనీకాంత్ వేసిన స్టెప్పుల గురించి మాత్రం అందులో ఎక్కడా రివీల్ చేయలేదు. దీంతో మేకర్స్ ఏదో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారని, థియేటర్లలో తలైవా డ్యాన్స్ ను బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేద్దామని ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. తాజాగా దీనిపై జైలర్ సినిమాలో కీలక పాత్రలో నటించిన జాఫర్ సాదిక్ ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అలా బోలేలో పాటను మామూలుగా షూట్ చేయలేదట. అందులో తలైవా ఏకంగా 200 మంది అమ్మాయిలతో కలిసి అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ వేశారట. ఆ ఫ్రేమ్ లో ఆయన డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది అని జాఫర్ తెలిపారు. అలా బోలేలో సాంగ్ షూటింగ్ జరుగుతున్న చివరి రోజున తాను స్వయంగా సెట్స్‌కు వెళ్లి ఆ మాస్ డ్యాన్స్ చూశానని చెప్పారు. రజనీ సార్ ఎనర్జీ చూసి యూనిట్ అంతా విజిల్స్ వేశారు అని ఆయన వెల్లడించారు. మరి అంత అద్భుతంగా చేసిన , భారీ ఖర్చు పెట్టి తీసిన పాటను ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటే.. కేవలం సినిమా రన్‌టైమ్ దృష్ట్యా మాత్రమే అని, మరే ఇతర కారణం లేదని జాఫర్ స్పష్టం చేశారు.



