ఆ ఇద్దరు కామెంటేటర్లపై వేటు…పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
కామెంట్లు (0)

ఒక పాక్ మాజీ ఆటగాడి కుమారులు ఇచ్చిన ఇంటర్వ్యూ కారణంగా మాజీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రస్తుతం కామెంటేటర్లుగా ఉన్న మైక్ అథర్టన్, నాజర్ హుస్సేన్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో మగ్గిపోతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది మొదట్లో ఇమ్రాన్ ఖాన్ కొడుకులను మైక్ అథర్టన్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అథర్టన్ తోపాటు నాజర్ హుస్సేన్ కూడా ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై విచారం వ్యక్తం చేయగా… ఇప్పుడు పాక్ లో జరిగే ఇంగ్లాండ్, శ్రీలంక ట్రై యాంగిల్ సిరీస్ లో కామెంట్రీ ప్యానల్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆరుగురు ఉన్న ఈ ప్యానల్లో అథర్టన్, నాజర్ హుస్సేన్ కి చోటు లేకపోవడం ఈ అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో వ్యక్తమవుతోంది.
ఇక పాక్ లో జైలులో ఉన్న తమ తండ్రిని జైల్లోనే చంపేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఇమ్రాన్ ఖాన్ కొడుకులు ఖాసీమ్, సులేమాన్ ఆరోపణలు గుప్పించిన ఆ సందర్భంతో పాక్ బోర్డ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక వైపు ఇంగ్లాండ్ - పాక్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఈ ఇంటర్వ్యూ ప్రసారం కావడంపై పీసీబీ అసంతృప్తి ఈ విధంగా మరోసారి వ్యక్తమైనట్లే కనిపిస్తోంది. ఇక అప్పటి ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కుమారుల ఆరోపణలను పాక్ ప్రభుత్వం ఖండించింది. ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నాడు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఇమ్రాన్ ఖాన్ ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటు భారత్ లోని కపిల్ దేవ్ వంటి మాజీ దిగ్గజ క్రికెటర్లు సైతం ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మనవతాదృక్పథంతో చూడాలని అన్నారు.



