కేటీఆర్ గడ్డం వెనుక అసలు స్టోరీ ఇదే..!
కామెంట్లు (0)

రాజకీయ నాయకులు వేసుకునే బట్టలు, వారి హెయిర్ స్టైల్, గడ్డం లాంటివి కూడా రాజకీయాల్లో అప్పుడప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటాయి. ముఖ్యంగా యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంటి నాయకుడు ఒక్కసారిగా తన స్టైల్ మారిస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా జరిగిన సింగరేణి కార్మిక గర్జన సభలో కేటీఆర్ ఒక సరికొత్త గడ్డం లుక్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. మొన్నటి వరకు క్లీన్ షేవ్‌తో చాలా ప్రొఫెషనల్‌గా, కార్పొరేట్ స్టైల్లో కనిపించిన కేటీఆర్.. ఉన్నట్టుండి ఇలా మాస్ అవతార్ లో కనిపించారు. కొద్ది రోజుల క్రితం సింగరేణి ఏరియాలో జరిగిన కార్మిక గర్జన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో ఆయన స్పీచ్‌తో పాటు, ఆయన గడ్డం కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇదే విషయంపై పార్టీలో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. అన్నా.. గడ్డం పెంచినవ్ ఏం సంగతి? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అడిగితే.. దానికి కేటీఆర్ చాలా సరదాగా ఆన్సర్ ఇచ్చారు. వెళ్లేది గోదావరిఖని.. సింగరేణి ఏరియాకు కదా.. ఆ మాత్రం మాస్‌గా ఉండాలే.. లేకపోతే అక్కడ నడవదు అంటూ కేటీఆర్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అంటే సింగరేణి ప్రాంత పర్యటన, అక్కడి కార్మికులకు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ లుక్ మార్చేసినట్లు కేటీఆర్ పరోక్షంగా చెప్పకనే చెప్పారు. కానీ, రాజకీయాల్లో ఏ నాయకుడూ ఊరికే ఒక పని చేయరు. దీని వెనుక కచ్చితంగా ఏదైనా ప్రత్యేక రాజకీయ వ్యూహం ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే గులాబీ శిబిరంలో ఈ కొత్త లుక్‌పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.
ఈ గడ్డం వెనుక అసలు కారణం ఇంకేదైనా ఉందా అన్న టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. ఎస్పెషల్‌గా యూత్‌ను.. అందులోనూ జెన్‌జీ యువతతో పాటు.. 40 ఏళ్ల లోపు ఉన్న ఓటర్లను అట్రాక్ట్ చేయాలని కేటీఆర్ టార్గెట్‌గా పెట్టుకున్నారన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే యూత్‌లో కేటీఆర్‌కు మంచి ఇమేజ్ ఉంది. దాన్ని మరింత పెంచుకునేందుకు, మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు ఈ మాస్ అవతార్ ఎత్తారని కూడా అంటున్నారు. ఈమధ్య కేటీఆర్ జెన్‌జీతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు. స్పెషల్ చిట్-చాట్లు నిర్వహిస్తూ, పాడ్‌కాస్ట్‌ల్లో పాల్గొంటూ నెక్స్ట్ జనరేషన్ ఓటర్లను ఆకట్టుకునే స్కెచ్ వేస్తున్నారు. సేమ్ టైమ్, త్వరలో గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ జరగబోతున్న వేళ, యువతకు కనెక్ట్ అయ్యేలా ఇలా బియర్డ్ లుక్‌లో కనిపించడం వ్యూహాత్మకమే అని తెలుస్తోంది. అలాగే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు కాస్త రఫ్ లుక్‌లో ఉంటే జనాలు ఈజీగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారనేది మరో పాలిటికల్ థియరీ. అయితే ఈ లుక్ వెనుక మరేదైనా పర్సనల్ సెంటిమెంట్ ఉందా అని కూడా క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది.
అయితే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ పక్కా కార్పొరేట్ స్టైల్లో మెరిసేవారు. అసెంబ్లీ సమావేశాల్లోనైనా, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ సదస్సుల్లోనైనా ఎంతో టిప్‌టాప్‌గా కనిపించేవారు. అలాంటి నాయకుడు ఇప్పుడు పూర్తిస్థాయిలో గడ్డంతో కనిపించడంతో సోషల్ మీడియాలో ఆయన పాత, కొత్త ఫొటోలను పక్కపక్కన పెట్టి నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఓవైపు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేస్తూనే.. మరోవైపు పార్టీని మళ్లీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో కేటీఆర్ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన కొత్త లుక్ అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది. మరోవైపు, అటు అధికార కాంగ్రెస్ నాయకులు కూడా కేటీఆర్ లుక్ వెనుక ఏముందని ఆరా తీస్తూనే.. ఎప్పటిలాగే తమదైన స్టైల్లో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. లుక్కులు మార్చినంత మాత్రాన పోయిన అధికారం రాదని, ప్రజల మనసు గెలవాలని కాంగ్రెస్ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఏదేమైనా.. గడ్డం వెనుక రాజకీయ వ్యూహం ఉందో లేదో తెలియదు కానీ, కేటీఆర్ న్యూలుక్ మాత్రం తెలంగాణ పాలిటిక్స్‌లో ఒక మంచి డిస్కషన్ పాయింట్‌గా మారింది. మరి కేటీఆర్ తన ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం ఈ మాస్ లుక్‌ను ఇలాగే కంటిన్యూ చేస్తారా? లేక కొన్నాళ్ల తర్వాత మళ్లీ పాత ప్రొఫెషనల్ స్టైల్లోకి వచ్చేస్తారా అనేది చూడాలి.


