నాగ చైతన్య ‘వృషకర్మ’ కౌంట్‌డౌన్ షురూ!
కామెంట్లు (0)

నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా వృషకర్మ. ఇదొక సాధారణ సినిమా కాదు. మైథలాజికల్ త్రిల్లర్ అనే ఒక సరికొత్త జానర్‌తో అక్కినేని అభిమానులను, తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి నాగ చైతన్య రెడీ అయ్యాడు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా.. మూవీ యూనిట్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సుకుమార్ నిర్మాతలు. ఈ మూవీ డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరిగ్గా 50 రోజుల తర్వాత సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ మూవీ టీమ్ ఓ ప్రత్యేకమైన పోస్టర్ని విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.స్టోరీ, హీరో క్యారెక్టర్ ని పరిచయం చేసేలా ఆ పోస్టర్ ఉంది. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో పాన్ ఇండియా హంగులతో రూపొందిన చిత్రమిది. సాయి దుర్గ తేజ్‌తో విరూపాక్ష లాంటి ఒక బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ దండు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్.. తన రెండో సినిమాకే ఏకంగా అక్కినేని నాగ చైతన్య లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. విరూపాక్ష సినిమా టైమ్‌లో స్క్రీన్‌ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్పుట్స్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇప్పుడు వృషకర్మ కోసం కూడా కార్తీక్ దండు రాసుకున్న ఒక అద్భుతమైన లైన్‌ను సుకుమార్ మరింత షార్ప్‌గా, మరింత ఎంగేజింగ్‌గా మలిచారని ఇండస్ట్రీ టాక్. రీసెంట్గా యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం.. మైథాలజీ , మిస్టరీ, థ్రిల్.. ఈ మూడు అంశాలను కలిపి, ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అజనీష్ బి. లోక్‌నాథ్ పనిచేస్తున్నారు. నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్గా ఉండబోతోంది. బాలీవుడ్లో లాపతా లేడీస్, జామ్తారా లాంటి ప్రాజెక్ట్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్టర్ స్పర్ష్ శ్రీవాస్తవ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.



