మెగాస్టార్ తో మల్టీసారర్ పై కింగ్ నాగార్జున ఏమన్నారంటే?
కామెంట్లు (0)

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. తెలుగు సినీ పరిశ్రమలో ఒక శకం. దశాబ్దాలుగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని ప్రస్తుతం సీనియర్ అగ్రకథానాయకులుగా వెలుగొందుతున్నారు. ఆ రోజుల్లో ఈ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ ఎంతుందో, బయట మాత్రం అంతకు మించిన స్నేహం ఉండేది. అయితే అభిమానులకు ఎప్పుడూ ఒక పెద్ద కోరిక ఉండేది. తమ అభిమాన హీరోలు ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జునల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీ షోలలో, ఈవెంట్లలో అది ప్రతిబింబిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై, చిరంజీవితో మల్టీస్టారర్ చేయడంపై కింగ్ నాగార్జున స్వయంగా ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, ‘కాక’ సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు కింగ్ నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బిజీగా పని చేస్తున్నారు. ఇలా ఇద్దరూ తమ కెరీర్లో అత్యంత కీలకమైన ల్యాండ్‌మార్క్ సినిమాలతో బిజీగా ఉన్న వేళ.. వీరిద్దరి కాంబినేషన్‌పై నాగ్ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా నాగార్జున నటించిన ఒక ప్రాజెక్ట్ ఇట్లు అర్జున ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న నాగార్జునకు ఎదురైంది. మీరు, చిరంజీవి ఎప్పుడు కలిసినా మంచి కథ వస్తే కచ్చితంగా సినిమా చేస్తామని చెబుతుంటారు కదా, మరి ఆ మల్టీస్టారర్ కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? అని ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి నాగార్జున ఏమాత్రం ఆలోచించకుండా నేను కూడా ఆ సినిమా కోసం ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నాను. చిరంజీవి కి, నాకు మధ్య చాలా మంచి స్నేహం ఉంది. మా మధ్య అద్భుతమైన ర్యాపో ఉంది. మేమిద్దరం ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా.. కచ్చితంగా కలిసి ఒక సినిమా చేయాలనే మాట్లాడుకుంటాం. కానీ ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ కుదరాలంటే ప్రతిదానికీ ఒక సరైన సమయం రావాలి. ఆ టైమ్ తప్పకుండా వస్తుంది, అప్పుడు ఈ సినిమా కచ్చితంగా జరుగుతుంది అంటూ నాగ్ చాలా పాజిటివ్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇచ్చారు. అంటే ఇక్కడ నాగార్జున మాటలను బట్టి చూస్తే.. మెగాస్టార్‌తో కలిసి నటించడానికి తాను ఎప్పుడూ రెడీ అని నాగార్జున పచ్చజెండా ఊపేశారు. ఈ ఇద్దరు దిగ్గజాలకు సరిపోయే పవర్ఫుల్ స్క్రిప్ట్‌తో ఏ దర్శకుడు ముందుకొస్తాడా అని సినీ ప్రియులు ఆసక్తిగా చూస్తున్నారు. అభిమానులు కోరుకున్నట్లు వీరు కలిసి ఒక సినిమా చేస్తే సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.



