వరుస ఫ్లాపులు ఆశలన్నీ ఆ హీరోల పైనే…కీర్తి సురేష్ కమ్‌బ్యాక్ ఇస్తుందా?
కామెంట్లు (0)

ఎంతటి స్టార్ కైనా సరే ఇండస్ట్రీలో నిలబడాలంటే హిట్స్ పడాల్సిందే. టాలీవుడ్లో మహానటి సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న మన కీర్తి సురేష్ కు ఈ మధ్య ఆశించిన స్థాయిలో హిట్లు పడటం లేదు. రీసెంట్ టైమ్స్‌లో ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ పెద్ద బాక్సాఫీస్ హిట్ ఒక్కటి కూడా లేదు. దీంతో ఇప్పుడు ఒక్క సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే బాలీవుడ్ ఎంట్రీ కూడా బెడిసికొట్టడంతో.. ఇప్పుడు కీర్తి సురేష్ తన ఆశలన్నీ కేవలం రాబోయే కొన్ని టాలీవుడ్ ప్రాజెక్టుల పైనే పెట్టుకుంది. సౌత్‌లో వరుస ఫ్లాపులు పడుతున్న టైమ్‌లో ఎలాగైనా బాలీవుడ్లో పాగా వేయాలని కీర్తి సురేష్ గట్టిగా ప్లాన్ చేసుకుంది. అందులో భాగంగానే వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన బేబీ జాన్ సినిమాతో హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాబట్టలేకపోయింది. దీంతో బాలీవుడ్లో జెండా పాతాలన్న కీర్తి ఆశలకు మొదట్లోనే గట్టి బ్రేక్ పడింది. రీసెంట్గా న్యాచురల్ స్టార్ నాని నటించిన ది పారడైజ్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో కూడా సందడి చేసింది. కానీ, ఆ సినిమా రిజల్ట్ కూడా అనుకూలంగా లేకపోవడంతో.. ఆ స్పెషల్ సాంగ్ వల్ల కీర్తికి ఆశించిన గుర్తింపు దక్కలేదు. నటిగా ఎంత టాలెంట్ ఉన్నా, గ్లామర్ పాత్రలు, ప్రత్యేక గీతాలు చేసినా.. ఒక హీరోయిన్ కెరీర్‌కు నిజమైన బలం బాక్సాఫీస్ విజయాలే. ఈ కష్టకాలంలో కీర్తి సురేష్‌కు ఒక పెద్ద ఊరటనిచ్చే ప్రాజెక్ట్ త్వరలోనే మన ముందుకు రాబోతోంది. అదే సత్యవాన్ సావిత్రి . ఇదొక విభిన్నమైన కోర్ట్‌రూమ్ డ్రామా. ప్రస్తుతం కీర్తి ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి ఒక ఫన్ టీజర్ రిలీజ్ అయింది. అందులో కీర్తి సురేష్ ఒక లాయర్‌గా కనిపిస్తోంది. కోర్టులో తడబడే ఇంగ్లీష్‌తో, అమాయకమైన వాదనలతో ఆమె చేసే కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మహానటి తర్వాత కీర్తి నుంచి వస్తున్న ఒక పర్ఫెక్ట్ లేడీ ఓరియెంటెడ్ కథ ఇది. నవంబర్ 20న విడుదల కానున్న ఈ సినిమా గనక హిట్ అయితే.. కీర్తి సురేష్‌కు మళ్లీ పాత వైభవం రావడం గ్యారెంటీ.



