వారణాసి విధ్వంసం షురూ..రిలీజ్‌కు ముందే రూ.850 కోట్లు..షేక్ అవుతున్న బాక్సాఫీస్ రికార్డులు!
కామెంట్లు (0)

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా భారీ సినిమాలతో భారత సినీ పరిశ్రమ స్థాయిని పెంచేసిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆ భారీ ప్రతిష్టాత్మక చిత్రమే వారణాసి. సుమారు 1000 కోట్లకు పైగా కళ్లు చెదిరే బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తోంది. అసలు సినిమా రిలీజ్ కాకముందే, షూటింగ్ దశలో ఉండగానే.. ఈ సినిమా ఏకంగా 850 కోట్లను రికవరీ చేసిందన్న వార్త ఇప్పుడు ట్రేడ్ పండితుల మైండ్ బ్లాంక్ చేస్తోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వారణాసి ఓటీటీ వ్యాపారంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతోంది.
టైమ్ ట్రావెల్ , రామాయణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఒక యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కాబట్టి, గ్లోబల్ ఆడియన్స్ కు ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ బలంగా నమ్ముతున్నాయి. సినీ వర్గాల నుంచి అందుతున్న పక్కా సమాచారం ప్రకారం.. వారణాసి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 650 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒక ఇండియన్ సినిమాకు కేవలం డిజిటల్ రైట్స్ రూపంలోనే 650 కోట్లు రావడం ఇదే తొలిసారి. అంటే ఓటీటీ హక్కుల ద్వారానే సినిమా నిర్మాణ వ్యయంలో దాదాపు 80 శాతానికి పైగా బడ్జెట్ వెనక్కి రావడం విశేషం. దీనికి తోడు, ఆడియో హక్కులను ప్రముఖ టీ-సిరీస్ సంస్థ 50 కోట్లకు దక్కించుకుందని సమాచారం. ఇక టీవీల్లో ప్రసారం చేసే శాటిలైట్ హక్కులు కూడా అన్ని భాషల్లో కలిపి సుమారు 150 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది. అంటే కేవలం నాన్-థియేట్రికల్ వ్యాపారం ద్వారానే ఈ సినిమా సుమారు 850 కోట్లు బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇలా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ చూపిస్తున్న వారణాసి.. మరి థియేటర్లలో ఏ రేంజ్ లో కలెక్ట్ చేయాలి? ఈ సినిమా కమర్షియల్ గా లాభాల్లోకి రావాలంటే థియేటర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అంటే బాక్సాఫీస్ వద్ద 800 కోట్ల నుంచి 900 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధించినట్లే. రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సాధించిన వసూళ్లతో పోలిస్తే, వారణాసికి రాబోయే హైప్ దృష్ట్యా తొలి నాలుగైదు రోజుల్లోనే ఈ మార్కును దాటేయడం ఏమాత్రం కష్టం కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే, అంతర్జాతీయ స్థాయిలో వారణాసి సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు గట్టి ప్రణాళికలు రచిస్తున్నారు. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ప్రముఖ హాలీవుడ్ పంపిణీ సంస్థ లైట్‌స్టార్మ్ ద్వారా ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ తో కలసి చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్.. నెట్‌ఫ్లిక్స్ డీల్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా ఎందుకు రాలేదు అని. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన ఇంటర్నల్ మేనేజ్మెంట్ లో కొన్ని మార్పులు చేస్తోంది. ఉద్యోగుల కోత, ఉన్నతాధికారుల మార్పుల వల్ల కొత్త ప్రాజెక్ట్‌ల కొనుగోలు ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది. అందుకే చర్చలు చివరి దశకు చేరినా, అధికారిక ప్రకటన రావడానికి కాస్త సమయం పట్టొచ్చు.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా నటిస్తోంది. అలాగే ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఏంటంటే.. మహేశ్ బాబు తన భాగానికి సంబంధించిన చిత్రీకరణను ఇప్పటికే పూర్తి చేశారట. ప్రస్తుతం సినిమాలో ఉన్న ఇతర కీలక సన్నివేశాలను, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ పనులను రాజమౌళి అత్యంత శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పర్ఫెక్ట్ గా పూర్తి చేసి, ఈ దృశ్యకావ్యాన్ని ఏప్రిల్ 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా బడ్జెట్ 1000 కోట్లు ఉండటం, అది రిలీజ్ కు ముందే 850 కోట్లు వెనక్కి తీసుకురావడం చూస్తుంటే.. టాలీవుడ్ స్టామినా ఏంటో ప్రపంచానికి అర్థమవుతోంది.



