తొలి నోబెల్ గ్రహీత.. రవీంద్రనాథ్ ఠాగూర్..!

Spread the love

Rabindranath Tagore Biography: విశ్వకవి, జాతీయగీత సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి నేడు. 1861, మే 7న కోల్‌కతా‌లో జన్మించారు. తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవీ. వీరికి పద్నాలుగో సంతానం ఠాగూర్. బాల్యంలో ఠాగూర్ పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడేవారు కాదట. ఇంటి వద్దే పుస్తకాలు చదువుకొనేవారట. ఉదయం గణితం, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఆంగ్ల భాషను అభ్యసించేవారట. ఆయన బెంగాలీలో రచించిన భక్తీ గీతాలను.. ‘గీతాంజలి’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఆ తర్వాత అది అనేక భాషల్లోకి తర్జుమా అయ్యి.. పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.

1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో బంకించంద్ర చటర్జీ రచించిన ‘వందేమాతం’.. రవీంద్రుడు రాసిన ‘జనగణమణ’ గీతాల్లో దేనిని ప్రకటించాలని సుధీర్ఘ చర్చ జరిగిన సమయంలో.. రవీంద్రుడి ‘జనగణమన’ దే పై చేయి సాధించింది. రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న ‘జనగణమన’ను జాతీయగీతంగా, ‘వందేమాతరా’న్ని జాతీయ గేయంగా ప్రకటించాడు. రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని కూడా తెలిపాడు. బంగ్లాదేశ్ జాతీయ గీతమైన ‘అమర్ సోనా బంగ్లా’ను కూడా రవీంద్రుడే రచించడం విశేషం.

రవీంద్రుడు ‘శాంతినికేతన్‌’గా ప్రసిద్ధి చెందిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారు. 1913లో సాహిత్యంలో రవీంద్రుడికి నోబెల్ బహుమతి లభించింది.
‘విశ్వకవి’ అనే బిరుదును సాధించి పెట్టింది. నోబెల్ పొందిన తొలి భారతీయుడిగానే కాక.. ఆసియాలోనే తొలి వ్యక్తిగా ఠాగూర్ గుర్తింపు పొందారు. నేడు రవీంద్రుడి జయంతి సందర్భంగా ఆయన కలం నుంచి జాలువారిన కొన్ని కొట్స్… Rabindranath Tagore Biography.

  • నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు మాత్రమే.. చక్కటి విద్యార్థులను తయారు చేయగలడు.
  • నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే.. విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.
  • చెడుగా ఆలోచించే గుణమే.. సగం సమస్యలకు కారణం..
  • మనది కానీ వస్తువుపై వ్యామోహం తగదు. అది మూర్ఖత్వం.
  • నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవద్దు.. అది పాపం.. ఆత్మహత్య కన్నా ఘోరం!