వెనెజువెలా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల గోల్డ్

Spread the love

వెనెజువెలా నుంచి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం వచ్చింది. ఇది భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.923 కోట్లు. వెనెజువెలా దగ్గర  500 బిలియన్ డాలర్ల బంగారు వనరులు ఉన్నాయని అమెరికా హోం మంత్రి డగ్ బర్గమ్ తెలిపారు. ఈ బంగారం వచ్చిందని, ఆ దేశం వద్ద పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. వెనెజువెలా గవర్నమెంటు ఆధ్వర్యంలోని బంగారం మైనింగ్ కంపెనీ మినర్వెన్‌ తో లావాదేవీలకు అనుమతిస్తూ అమెరికా ఇప్పటికే లైసెన్స్ జారీ చేసింది. ఆ సంస్థతో కలిసి తవ్వకాలు చేపట్టింది. ఇటీవల వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌తో బర్గమ్ సమావేశమయ్యారు. అలాగే అమెరికా మైనింగ్, మినరల్ కంపెనీలతోనూ చర్చలు జరిపారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో వెనెజువెలాలో చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితులు  (నికోలస్ మదురో స్థానంలో డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా రావడం) గురించి విషయం తెలిసిందే. చమురుతో పాటు బంగారంపై కూడా అమెరికా తన పట్టును పెంచుకుంటోంది. వెనెజువెలా మైనింగ్ రంగంలో అమెరికా సంస్థలు ఇన్వెస్ట్ చేయడానికి ఇది తొలి అడుగుగా అభిప్రాయపడుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *