దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు పెరగడం మరియు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా కీలక సూచీలు నష్టాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 416 పాయింట్లు నష్టంతో 76,886 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 23,995 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.94.63గా కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 110 డాలర్ల మార్కును దాటడం మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించేలా చేసింది. మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి మార్కెట్ల పై ప్రభావం చూపింది. అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్ తదితర షేర్లు లాభాలతో ముగిశాయి.