భారీ నష్టాలతో సూచీల బేజారు..!

Spread the love

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో నేటి ట్రేడింగ్ ముగించాయి. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం, చమురు ధరల పెరుగుదల  ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ముగించాయి. ఇక దేశీయ సూచీలు బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 1836  పాయింట్లు నష్టంతో  72,696 పాయింట్ల వద్ద స్థిరపడగా..నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 601 పాయింట్లనష్టంతో 22,512 వద్ద ముగిసింది. డాలర్ తో  రూపాయి మారకపు విలువ రూ.93.38గా కొనసాగుతోంది. మెటల్, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు ఎక్కువగా నష్టపోయాయి. సెన్సెక్స్ 30లో టెక్ మహీంద్రా, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ షేర్లు లాభాలతో ముగిశాయి. ఇటువంటి అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *