ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ నెక్స్ట్ సినిమా కూడా మెగా హీరోతోనేనా???

Spread the love

టాలీవుడ్‌లో ప్రతి దర్శకుడి కల ఒకటే మెగాస్టార్‌తో సినిమా చేయడం. ఆ కలను నిజం చేసుకోవాలని చాలా మంది ప్రయత్నించినా, అవకాశాలు మాత్రం కొద్ది మందికే దక్కుతాయి. ముఖ్యంగా చిరంజీవి  లాంటి లెజెండరీ స్టార్‌తో పని చేయడం అంటే అది కెరీర్‌లో ఒక మైలురాయి. కానీ ఆయన సినిమా లైనప్ మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటం వల్ల, ఎవరితో సినిమా చేస్తారనే విషయంపై ఎప్పుడూ సస్పెన్స్ ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి యంగ్ డైరెక్టర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘విశ్వంభర’ కోసం వసిష్ఠతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం బాబీ కొల్లి,  అలాగే శ్రీకాంత్ ఓదెలతో కూడా ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయని సమాచారం.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో దర్శకుడు తన కోరికను బయటపెట్టడం ఆసక్తికరంగా మారింది. అదే హరీష్ శంకర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన హరీశ్ శంకర్, ఇప్పుడు మళ్లీ ఆయనతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ లో బిజీగా ఉన్న హరీశ్, తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. తనకు చిరంజీవితో ఒక పక్కా ఎంటర్‌టైనర్ సినిమా చేయాలని చాలా రోజులుగా ఉందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ‘రౌడీ అల్లుడు’, ‘దొంగ మొగుడు’, ‘గ్యాంగ్ లీడర్’ తరహాలో ఫుల్ మాస్, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే సినిమా తీయాలనేది తన కోరిక అని స్పష్టం చేశారు. ఇంకా ఒక ఆసక్తికర విషయాన్ని కూడా హరీశ్ శంకర్ వెల్లడించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ చూసిన తర్వాత చిరంజీవి స్వయంగా ఆయనకు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారట. ట్రైలర్‌లోని డైలాగ్స్ బాగున్నాయని, పవన్ కళ్యాణ్ చాలా అందంగా కనిపించారని ప్రశంసించారట. ఆ సంభాషణ తర్వాత చిరంజీవి, పవన్ మధ్య ఉన్న అనుబంధం ఎంత బలంగా ఉందో తనకు అర్థమైందని హరీశ్ చెప్పారు. “ఆయనకు పవన్ కేవలం తమ్ముడు మాత్రమే కాదు, కొడుకులా అనిపిస్తాడు” అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. హరీశ్ శంకర్ ఇప్పటికే చిరంజీవిని పలుమార్లు కలిసినట్లు, కొన్ని యాడ్స్ కూడా కలిసి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి మధ్య ఒక సినిమా గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని సంకేతాలు ఇచ్చారు. “తప్పకుండా చిరంజీవితో ఒక మాస్ ఎంటర్‌టైనర్ చేసి తీరుతాను” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే, హరీశ్ శంకర్ డ్రీమ్ మాత్రం క్లియర్ చిరంజీవితో ఒక మాస్ ఎంటర్‌టైనర్ చేయడం. కానీ ఆ కల నిజం కావాలంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మంచి విజయం సాధించాల్సిందే. మరి ఈ సినిమా ఆయన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువస్తుందా? ఆ తర్వాత మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *