ఎంటర్‌టైన్‌మెంట్, ఎగ్జైట్‌మెంట్, సర్‌ప్రైజ్‌…వెంకీ-త్రివిక్రమ్ సినిమా సందడి

Spread the love

అన్ని రకాల ఎమోషన్స్ తో కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే విక్టరీ వెంకటేష్, అదిరిపోయే మాటలతో మ్యాజిక్ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ అనగానే టాలీవుడ్‌లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. సరికొత్త టైటిల్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్  ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే 47 అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. కన్నడ భామ శ్రీనిధి శెట్టి ఇందులో కథానాయకిగా నటిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకు వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు అందించారు. కానీ వీరిద్దరి కలయికలో హీరో, దర్శకులుగా సినిమా రావడం ఇదే తొలిసారి. దీంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా…శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, పూజిత పొన్నడ, రావు రమేష్, బ్రహ్మాజీ వంటి భారీ తారాగణం నటిస్తోంది. కెవిన్ కుమార్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. అక్టోబర్ లో  ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాత్రల పరిచయ గ్లింప్స్‌లు సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఈ సినిమా అప్డేట్స్ గురించి నిర్మాత నాగ వంశీ వెంకీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. మీరు ‘ఆదర్శ కుటుంబం’  కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు… ప్రతిరోజూ అడుగుతూనే ఉన్నారు కదా  మేము మీ మాట విన్నాం… ఆలస్యమైనందుకు సారీ. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు ముందు వచ్చే ఈ నెల మొత్తం సర్‌ప్రైజ్‌లతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతోంది. వచ్చే వారం ప్రారంభంలో టీజర్, రెండో వారంలో మొదటి పాట, చివరి వారంలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానున్నాయి. అంతేకాదు, ప్రతి వారం మీ ముందుకు ఒక మ్యూజికల్ కంటెంట్ కూడా రాబోతోంది. ఎంటర్‌టైన్‌మెంట్, ఎగ్జైట్‌మెంట్, సర్‌ప్రైజ్‌లతో నిండిన ఈ నెలకు సిద్ధంగా ఉండండి. అని చెప్పారు. దీంతో ఇక ఈ సినిమా గురించిన వార్తలతో సోషల్ మీడియా సందడి షురూ కాబోతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *