మరోసారి మెగా కాంబినేషన్..ఈసారి ఏ రేంజ్ లో అదరగొడతారో..! 

Spread the love

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కాంబినేషన్ మళ్లీ సూపర్ హిట్ ఇవ్వబోతోంది అన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మెగా గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘రంగస్థలం’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా కేవలం బాక్సాఫీస్ హిట్ మాత్రమే కాదు, చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ వస్తుండడంతో అంచనాలు ఆకాశాన్నంటడం సహజమే. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిసిందే. అలాగే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక కొంతకాలం విరామం తీసుకుని, వెంటనే సుకుమార్‌తో చేయబోయే కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాలని చరణ్ నిర్ణయించుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సుకుమార్ తన టీమ్‌తో కలిసి ఈ కథను మరింత మెరుగుపరచే పనిలో నిమగ్నమై ఉన్నారట. ఆయన స్టైల్‌కి తగ్గట్టు ప్రతి చిన్న అంశాన్ని కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దుతూ, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని చూస్తున్నారు. ముఖ్యంగా కథ కంటే పాత్రలపై ఎక్కువ దృష్టి పెట్టడం సుకుమార్ ప్రత్యేకత. ఆయన తీసిన ప్రతి సినిమాలో హీరో పాత్రకు ఒక ప్రత్యేకమైన మేనరిజం, ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ కోసం సుకుమార్ సిద్ధం చేస్తున్న పాత్రపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ పాత్ర ఇప్పటివరకు ఆయన చేయని విధంగా విభిన్నంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. కొత్త షేడ్స్, కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త ఎమోషనల్ ఎలివేషన్ అన్ని కలిపి ఒక సరికొత్త చరణ్‌ను ప్రేక్షకులకు చూపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్రలో చరణ్ తన నటనలో మరో మెట్టు ఎక్కుతారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి సినిమా ఏ జానర్‌లో ఉండబోతోందన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే, సుకుమార్ ఆలోచన మాత్రం ఎప్పుడూ ఊహకు అందకుండా ఉంటుంది. అందుకే ఆయన ఎంచుకునే కాన్సెప్ట్‌ పై మరింత ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *