
Megastar Cycle Lady Fan: కష్టేఫలి.. కృషితో నాస్తి దుర్భిక్షం.. వంటి మాటలకు అసలైన అర్ధం లాగా అనిపిస్తారు మెగాస్టార్ చిరంజీవి . నటుడిగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగి మెగాస్టార్ గా తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. అయితే సినీ తెరపై మాత్రమే కాకుండా నిజజీవితంలోనూ ఆయన చూపించే స్ఫూర్తిదాయకమైన మానవతా విలువలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే నటీనటులపై అభిమానులు ఒక్కో రకంగా బయటపెడుతుంటారు. ఒక్కోసారి వారు చూపే ప్రేమాభిమానాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సాధారణంగా ఎక్కువగా ఇలాంటి పనులు మగవారు చేస్తూ ఉంటారు. కానీ అనూహ్యంగా ఓ మహిళా అభిమాని చిరంజీవిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణంలో రాజేశ్వరి అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు చిరంజీవి (Megastar Chiranjeevi) అంటే ఎంతో ఇష్టం. ఆయనకు వీరాభిమాని. ఈ క్రమంలో చిరును కలవాలని భావించింది. అనుకున్నదే తడవుగా సైకిల్ పై ఆదోని నుంచి హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టింది.
మధ్యలో ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురైనప్పటికి కూడా ఆమె చిలించలేదు. చిరంజీవిపై ఉన్న అపారమైన అభిమానమే ఆమెను ముందుకు నడిపించాయి. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. తనను కలుసుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి చలించిపోయారు. ఓ చిరస్మరణీయ జ్ఞాపకాన్ని అందించారు. ఇక రాజేశ్వరి మెగాస్టార్‌కు రాఖీ కట్టగా.. ఆమెకు ఆశీస్సులు అందించడంతో పాటు చీరను బహుమతిగా ఇచ్చారు. అంతేకాదండోయ్.. రాజేశ్వరి పిల్లల విధ్య కోసం, వారి భవిష్యత్ కోసం ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
చిరంజీవి ఇంట్లో స్వయంగా తన ఆరాధ్యుడిని కలుసు కుంది.ఆ క్షణం గురించి మాట్లాడుతూ..పరమశివుడే దర్శనం ఇచ్చినట్లుగా అనిపించిందని కంటతడి పెట్టింది. అన్నా.. సోదరిగా రాఖీ కడతానని రాజేశ్వరి కోరగా చిరంజీవి హృదయపూ ర్వకంగా ఆ రాఖీని కట్టించు కున్నారు.అభిమాని మనసు దోచుకున్న ఆ క్షణం.. అక్కడి వారినీ కన్నీళ్లు పెట్టించింది. Megastar Cycle Lady Fan.
ఆదోని నుంచి సైకిల్‌పై ప్రారంభమైన ఒక ప్రయాణం..హైదరాబాద్‌లో హృదయాన్ని కదిలించిన అనుబంధంగా ముగిసింది. అభిమాని,ఆరాధ్య నటుడు మధ్య చోటుచేసు కున్న ఈ బంధం..అభిమానం అంటే ఇంతే.. చిరంజీవి అంటే ఇంతే అని మళ్లీ నిరూపిం చింది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q