అంబేద్కర్ అభిమానులందరూ ఈ సినిమా చూడాలి: మందకృష్ణ

Spread the love

AGRAHARAM LO AMBEDKAR మంతా కృష్ణచైతన్య కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అగ్రహారంలో అంబేద్కర్‌’. భారత రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సిద్ధాంతాల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులోని టైటిల్‌ సాంగ్‌ను ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) తాజాగా విడుదల చేశారు.

అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… ‘‘కృష్ణచైతన్య (Mantha Krishna Chaitanya) ఎన్నో కష్టాలు పడి తెరకెక్కించిన చిత్రమిది. అంబేద్కర్ అభిమానులైన ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలి’’ అని పిలుపునిచ్చారు.

కథానాయకుడు, దర్శకనిర్మాత కృష్ణచైతన్య(Mantha Krishna Chaitanya) మాట్లాడుతూ ‘‘అంబేడ్కర్‌ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్‌కి మా చిత్రం గొప్ప నివాళి. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుంది. మా చిత్రం టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన మందకృష్ణ (Manda Krishna Madiga) గారికి థ్యాంక్స్’’ అన్నారు.

ఈ చిత్రంలో శ్రీరంగం పంకజ్, విజయ్ కొడాలి, జాహ్నవి, రఘు, సుబ్బయ్య శాస్త్రి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ – లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై మంతా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. AGRAHARAM LO AMBEDKAR