ఎట్టకేలకు తన మనసులో బాధ బయటపెట్టిన ఏఎం రత్నం..?

Spread the love

AM Rathnam Veeramallu Producer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన చిత్రాలు హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. అయితే.. ఈ మూడు సినిమాల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా అంటే.. ఓజీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందంటే.. పవర్ స్టార్ ఎక్కడికి వెళితే అక్కడ అభిమానులు ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేశారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్‌ కూడా ఓజీ ఓజీ అంటూ ఆపండయ్యా.. కాస్త ఆగండి.. సినిమా చూద్దురు గానీ.. అంటూ అభిమానులకు చెప్పడం జరిగింది. అయితే.. వీరమల్లు గురించి ఎప్పుడూ.. ఎక్కడా.. నినాదాలు చేసిన సందర్భం లేదు. దీని గురించి.. ఏఎం రత్నం తన బాధను బయటపెట్టారు. ఇంతకీ.. ఏఎం రత్నం బాధ ఏంటి.. ఆయన ఏం చెప్పారు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే.. ఎవరైనా చాలా స్పీడుగా సినిమా కంప్లీట్ చేసేలా రీమేక్ మూవీ చేద్దామా..? లేకపోతే తక్కువ లోకేషన్స్ లో తక్కువ డేట్స్ లో కంప్లీట్ అయ్యే సినిమా చేద్దామా అని ఆలోచిస్తారు. అయితే.. ఏఎం రత్నం మాత్రం చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలి అనుకున్నారు. అందుకనే భారీ పీరియాడిక్ మూవీ వీరమల్లు చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఇలాంటి సినిమా చేయడం వలన రకరకాల కారణలతో బాగా ఆల‌స్యం అయింది. బ‌డ్జెట్ త‌డిసి మోపెడైంది. ఇక సినిమాను రిలీజ్ చేయ‌డానికి ఆయ‌న ప‌డ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు అన్ని అడ్డంకుల‌నూ దాటుకుని ఈ శుక్ర‌వారం వీర‌మ‌ల్లు రిలీజ్ కాబోతుంది. AM Rathnam Veeramallu Producer.

అయితే.. వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఏఎం రత్నం తన మనసులో బాధను పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. కొన్నేళ్లుగా ప‌వ‌న్ ఎక్క‌డికి వెళ్లినా ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేసారు కానీ.. ఓజీ కంటే ముందు మొద‌లైన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు గురించి ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎక్క‌డా మాట్లాడ‌క‌పోవ‌డం, నినాదాలు చేయ‌క‌పోవ‌డం త‌న‌ను బాధించిన విష‌యాన్ని ర‌త్నం ఈ సంద‌ర్భంగా పంచుకున్నారు. అభిమానులే కాదు.. పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన వేరే సినిమాల గురించి కూడా మాట్లాడలేదు అనుకోండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేసారు.

ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని అరవడానికి కారణం.. టైటిల్ షార్ట్ గా ఉండడం.. అలాగే అట్రాక్టివ్ గా ఉండడం వలన ఓజీ ఓజీ అనేవారని.. హరి హర వీరమల్లు పెద్ద టైటిల్ కాబట్టి అభిమానులు అరవలేదని అనుకునేవాడిని తెలియచేశారు ఏఎం రత్నం. అయితే.. వీరమల్లుని వీర అని షర్ట్ కట్ చేసి వీర వీర అని అరవచ్చు కదా.. అని ఫీలయ్యేవాడిని కానీ.. ఎవరూ అలా పిలవలేదన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ గారు వీరమల్లు గురించి చెప్పారు కాబట్టి హ్యాపీగా ఉందన్నారు. ఈ విధంగా వీరమల్లు, ఓజీ గురించి తన బాధ ఏంటో.. ఏం ఫీలయ్యారో బయటపెట్టారు ఏఎం రత్నం. మరి.. వీరమల్లు బ్లాక్ బస్టర్ అయి ఏఎం రత్నం బాధను పోగొడుతుందని ఆశిద్దాం..

Also Read: https://mega9tv.com/cinema/pawan-kalyan-and-akira-cutout-in-bangalore-for-hari-hara-veera-mallu-movie-release-celebration/