‘పెద్ది’ పై అంచనాలు పెంచేసిన అవినాష్

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. ఈ సినిమా గురించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు  రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న బిగ్ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’ గుర్తింపు పొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్  హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం అంటేనే ఒక మ్యాజిక్. ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న రెహమాన్ ఇప్పుడు ‘పెద్ది’ కోసం అందిస్తున్న ట్యూన్స్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఐటమ్ సాంగ్‌కు ఆయన ఎలాంటి బీట్ ఇచ్చారో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెహమాన్ సంగీతం, రామ్ చరణ్ ఎనర్జీ, బుచ్చిబాబు విజన్ కలిసి ఈ సాంగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు అదరగోట్టాయి. ఇక స్పెషల్ సాంగ్ గురించి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల ‘పెద్ది’ కథ గురించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరోసారి చర్చకు దారి తీశాయి. సాధారణంగా ఒక సినిమా కథ విన్నప్పుడు టెక్నీషియన్లు అందులోని సెట్స్, విజువల్స్, గ్రాండియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ ‘పెద్ది’ కథ విన్న తర్వాత మాత్రం అవినాష్ కొల్లా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట. ఆయన చెప్పిన ప్రకారం.. కథ విన్నాక దాదాపు 20 నుంచి 25 నిమిషాల వరకు సాధారణ స్థితికి రాలేకపోయారట. తన కెరీర్‌లో ఇలాంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదని ఆయన పేర్కొనడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ డ్రామా సినిమాకు ప్రధాన బలం అవుతుందని చెబుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *