రూ.1500 కోట్లు దాటేసిన ‘ధురంధర్-2’

Spread the love

దేశానికి ముప్పుగా నిలిచే ఉగ్రవాద శక్తులను వారి దేశానికే వెళ్లి ఎదుర్కొనే కథతో తెరకెక్కిన మూవీ ధురంధర్. మొదటి భాగంతో దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో పార్ట్ ‘ధురంధర్-2’..ది రివెంజ్’ తో మొదటి భాగాన్ని మించి రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది.  ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతోంది. దాదాపుగా నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆద్యంతం ఆసక్తికరంగా చూసేలా చేసే కథా కథనాలతో ఆకట్టుకుంది. రణ్ వీర్ సింగ్, రాకేష్ బేడీ, సారా అర్జున్, మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, డానిష్ పండర్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ వంటి భారీ అండ్ పర్ఫెక్ట్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా  ముఖ్యంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు వారాల్లో మొత్తంగా రూ.1501 కోట్ల వసూళ్లను రాబట్టింది. భారత్ లో రూ.1134 కోట్లు, ఓవర్సీస్ లో రూ.367 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి వారంలో రూ.637 కోట్లు, 8వ రోజు రూ.53కోట్లు, 9వ రోజు రూ.42 కోట్లు, 10వ రోజు రూ. 64 కోట్లు, 11వ రోజు రూ.71 కోట్లు రాబట్టింది. ఈ రేంజ్ కలెక్షన్లతో అప్రతిహతంగా దూసుకుపోతున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *