మెగాస్టార్ నుంచి మరో సర్ప్రైజ్..!

Spread the love

Mega158 Movie Poster: మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా అప్డేట్లు బ్యాక్ టూ బ్యాక్ వస్తున్నాయి. నిన్న విశ్వంభర నుంచి గ్లింప్స్ రిలీజైతే.. ఈ రోజు ఉదయం మెగా 157 టైటిల్ గ్లింప్స్ వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక తాజాగా మెగాస్టార్ మరో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు. ఈ అప్డేట్ ఆయన 158 వ సినిమాకు సంబంధించి కావడం విశేషం.

మెగాస్టార్ నుంచి సినిమా సుమారు రెండేళ్లు దాటిపోయింది. ఆయన చివరి సినిమా భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆలోచనలో పడిపోయిన చిరంజీవి ఇప్పుడు రూట్ మార్చారు. ‘విశ్వంభర’ అంటూ ఓ సోషియో ఫాంటసీ మూవీని మొదలుపెట్టారు. అయితే ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో లేట్ అవుతూ వస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ చేస్తున్నారు. అలానే శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ మూవీ కమిట్ అయ్యారు.

ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో చిరు వరుసగా సినిమాలు చేస్తున్నారు గానీ సరైన ఫలితాలు రావట్లేదు. ఈ క్రమంలోనే వచ్చి మంచి కమర్షియల్ హిట్ అయిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇప్పుడు మరోసారి చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ బాబీ అందుకున్నాడు. యష్ ‘టాక్సిక్’, దళపతి విజయ్ ‘జననాయగన్’ చిత్రాల్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. చిరు-బాబీ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

‘మెగా 158’ పేరుని ఈ ప్రాజెక్టుకి వర్కింగ్ టైటిల్‌గా నిర్ణయించారు. నెత్తురు-గొడ్డలిని పోస్టర్‌లో చూపించారు. చూస్తుంటే ఇది యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. మరి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు? హీరోయిన్, సంగీత దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తారేమో చూడాలి. మొత్తం మీద చిరంజీవి బర్త్ డే రోజు ఇలా బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ రావడం నిజంగా ఫ్యాన్స్ ను ఎంతో సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి.

Also Read: https://mega9tv.com/cinema/director-anil-ravipudi-says-there-will-be-a-combo-movie-with-chiru-and-balayya/