ఘాటీ, విశ్వంభర ప్లానింగ్ మారిందా…?

Spread the love

Ghati And Vishwambhara: ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ అనుష్క, క్రిష్ కాంబినేషన్లో ఘాటీ, చిరు, వశిష్ట్ కాంబినేషన్లో విశ్వంభర సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ రెండు సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ రెండు క్రేజీ సినిమాల విడుదల గురించి వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. ఇప్పుడు కొత్తగా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ప్లానింగ్ మారిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. మారిన ప్లాన్ ఏంటి..? ఘాటీ, విశ్వంభర రిలీజ్ ఎప్పుడు..?

లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ అనుష్క. బాహుబలి తర్వాత భారీ ఆఫర్స్ వచ్చినా.. ఆచితూచి సినిమాలు చేస్తుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఈమధ్య కాలంలో సక్సెస్ సాధించింది అనుష్క. ఈ సినిమా కంటే ముందు నిశ్శబ్దం అనే సినిమా మూడేళ్ల గ్యాప్‌లో వచ్చింది. ఇలా సినిమాకు సినిమాకు ఆమె చాలా గ్యాపే తీసుకుంటోంది. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క నటించిన ఘాటీ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలి కానీ.. కుదరలేదు. ఆతర్వాత జులైలో రిలీజ్ అనుకున్నారు కానీ.. ఈ నెలలో కూడా రిలీజ్ కావడం లేదు. ఆగష్టులో కూడా రిలీజ్ కావడం లేదు.

మరి.. ఘాటీ రిలీజ్ ఎప్పుడు అంటే.. సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. సెప్టెంబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక విశ్వంభర విషయానికి వస్తే.. సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ ప్లాన్ అక్టోబర్ కి మారిందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా కోసం చిత్రీకరించాల్సిన ఐటం సాంగ్ పై ఫోకస్ చేశారని తెలిసింది. మరో వైపు ఈ మూవీ గ్రాఫిక్స్ చాలా క్వాలిటీగా ఉండేలా స్పెషల్ కేర్ తీసుకోవాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి మేకర్స్ కి చెప్పారట. అందుకనే ఆలస్యం అయినా ఫరవాలేదు అనే ఉద్దేశ్యంతో క్వాలిటీ కంటెంట్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారట. Ghati And Vishwambhara.

ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం.. విశ్వంభర ముందుగా రిలీజ్ చేసి.. ఆతర్వాత ఘాటీ రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఇప్పుడు ప్లాన్ మారడంతో ముందుగా ఘాటీ రిలీజ్ చేసి.. ఆతర్వాత విశ్వంభర విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈ రెండు సినిమాలను యు.వీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించింది. త్వరలోనే రిలీజ్ డేట్స్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు టాక్. మరి.. ఈ రెండు సినిమాలు యు.వీ క్రియేషన్స్ కు లాభాలు తీసుకువస్తాయి ఏమో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/has-the-hindi-release-of-vijay-deverakondas-latest-movie-kingdom-has-been-postponed/