
Mahesh Rajamouli’s movie: సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. అయితే.. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఏంటంటే.. కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ.. మహేష్ తో సినిమా చేసేందుకు స్టోరీ రెడీ చేస్తున్న ఆ దర్శకులు ఎవరు..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడాల్సిందే..
రాజమౌళితో సినిమా అంటే.. ఖచ్చితంగా మూడేళ్లు పడుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. మూడో షెడ్యూల్ ను భారీగా ప్లాన్ చేశారు. విదేశాల్లో షూట్ చేసే ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. ఈ సినిమాని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలని జక్కన్న అనుకున్నప్పటికీ.. 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. ముందుగా రెండు పార్టులుగా ఈ సినిమాని తీస్తారేమో అనే టాక్ వినిపించినా.. ఒక పార్ట్ గానే ఈ సినిమాని తీస్తున్నారని తెలిసింది.
ఇక అసలు విషయానికి వస్తే.. మహేష్ బాబు నెక్ట్స్ మూవీ ఎవరితో అంటే.. ఊహించని విధంగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పేరు వినిపిస్తుంది. బోయపాటి మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కానీ.. ఇప్పటి వరకు వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఎలాగైనా సరే మహేష్ తో సినిమా చేయడం కోసం కథ రెడీ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అలాగే మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ కూడా ఎప్పటి నుంచో మూవీ చేయాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు మహేష్ కోసం అదిరిపోయే స్టోరీ లైన్ రెడీ చేశాడని టాక్ వినిపిస్తుంది. Mahesh Rajamouli’s movie.
బోయపాటి శ్రీను, ప్రశాంత్ నీల్ వీళ్లిద్దరే కాకుండా మరో డైరెక్టర్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. అతనే.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అసలు మహేష్, సందీప్ రెడ్డి వంగ కాంబో మూవీ ఎప్పుడో సెట్ కావాలి. కాకపోతే సందీప్ రెడ్డి వంగ చెప్పిన స్టోరీలో వయెలెన్స్ ఎక్కువ ఉండడంతో సెట్ కాలేదు. ఈసారి సూపర్ స్టార్ కోసం అదిరిపోయే స్టోరీ రెడీ చేశాడని తెలిసింది. మరి.. బోయపాటి శ్రీను, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ.. ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో మహేష్ నెక్ట్స్ మూవీ ఉంటుందేమో చూడాలి.