సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ‘పవర్ పేట’ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. సందీప్ కిషన్ యాక్టింగ్ కెరీర్ కు 16 సంవత్సారలైన సందర్భంగా ఒక పోస్టర్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. చెస్ బోర్డు, రక్తం మరకలతో ఉన్న పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేమ, గౌరవం, రాజకీయం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు అర్థమవుతోంది. కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలపనున్నారు. లిరిక్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత ‘రౌడీ ఫెలో’,’ఛల్ మోహన్ రంగ’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాలతో కృష్ణ చైతన్య దర్శకుడిగానూ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ ‘ప్రస్థానం’ సినిమాతో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రారా కృష్ణయ్య, బీరువా, ఏ 1 ఎక్స్ప్రెస్ తదితర హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.