
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ స్టార్ విజయ్ కెరీర్ లో ఆఖరి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి హెచ్ వినోద్ డైరెక్టర్. ఈ మూవీ బాలయ్య భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో జన నాయగన్ మూవీ భగవంత్ కేసరి రీమేకా..? కాదా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఏంటా కొత్త వార్త..?జన నాయగన్ రీమేక్ వెనకున్న నిజం ఏంటి..?
జన నాయగన్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది అనే టైమ్ లో దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు వినిపించింది. దీంతో జన నాయగన్.. భగవంత్ కేసరి రీమేక్ అనే విషయం నిజమే అని ప్రచారం ఎక్కువైంది. మేకర్స్ మాత్రం ప్రచారంలో ఉన్న వార్తల పై స్పందించలేదు. ఇక అనిల్ రావిపూడి ఓ ఇంటర్ వ్యూలో మాట్లాడుతూ.. భగవంత్ కేసరి రీమేక్ చేయమని అడిగారని.. అయితే ఒకసారి తీసేసిన కథనే మళ్లీ తెరకెక్కించడంలో ఇంట్రెస్ట్ ఉండదని.. అందుచేత వచ్చిన ఆ ఆఫర్ కి నో చెప్పానని అసలు విషయం బయటపెట్టాడు. అయినప్పటికీ సస్పెన్స్ గా ఉన్న ఈ రీమేక్ వ్యవహారంలో ఓ కొత్త వార్త వెలుగులోకి వచ్చింది.
అది ఏంటంటే.. జన నాయగన్ సినిమా కోసం భగవంత్ కేసరి మొత్తం కథ కాకుండా.. ఆ సినిమాలో ఉన్న గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే సీన్ కోసమే రీమేక్ రైట్స్ తీసుకున్నారట. ఈ కథను మార్పులు చేర్పులుతో పూర్తిగా మార్చేసారని టాక్. చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుగుతోంది. విజయ్ ఆఖరి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ వినోద్ అందర్నీ ఎంటర్ టైన్ చేసేలా ఈ మూవీని రూపొందిస్తున్నారట. జనవరి 9న జన నాయగన్ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అసలు ఇది భగవంత్ కేసరి రీమేకేనా..? నిజంగానే ఆ ఒక్క సీన్ కోసమే రీమేక్ రైట్స్ తీసుకున్నారా..? కథలో ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు అనేది తెలియాలంటే.. జన నాయగన్ వరకు ఆగాల్సిందే.