దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా గ్లామర్ తోనే కాకుండా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కథనార్’ నుండి మూవీ టీమ్ ట్రైలర్ ను విడుదల చేసింది. మలయాళంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ట్రైలర్ ను అత్యద్భుతంగా రూపొందించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్స్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. రోజిన్ థామస్ దర్శకత్వంలో శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ పై గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జయసూర్య, ప్రభుదేవా, వినీత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనుష్క కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది ఆమె నటించిన ‘ఘాటీ’ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ‘కథనార్’ తో అనుష్క భారీ హిట్ అందుకుంటుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.