క్రేజీ మూవీకి ఓకే చెప్పిన నాగచైతన్య !

Spread the love

Naga Chaitanya And mithran Movie: అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ మూవీతో 100 కోట్ల క్లబ్ లో చేరిన చైతూ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సాధించేందుకు ఈసారి థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఇదిలా ఉంటే.. చైతూ లేటెస్ట్ గా ఓ క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. చైతూ ఓకే చేసిన ఆ క్రేజీ మూవీ ఏంటి..? ఈ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు..?

చైతూ కార్తీక్ దండుతో చేస్తోన్న సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్లు ఈ సినిమాకి ఖర్చు పెడుతుండడం విశేషం. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చైతన్య తన కెరీర్ లో 25వ సినిమాని శివ నిర్వాణ డైరెక్షన్లో చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ చేస్తారని.. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ మూవీని పట్టాలెక్కిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈసారి శివ నిర్వాణ లవ్ తో పాటు యాక్షన్ కూడా చూపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

తాజాగా చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరికంటే.. సర్థార్ డైరెక్టర్ మిత్రన్ కు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. సర్దార్, అభిమన్యు సినిమాలతో తమిళనాట తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మిత్రన్. ఈ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కూడా మిత్రన్ కు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం మిత్రన్ సర్థార్ 2 సినిమా వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మిత్రన్ నాగచైతన్యతో సినిమా చేయనున్నాడని.. మిత్రన్ చెప్పిన కథకు చైతూ ఓకే చెప్పాడని.. వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

ఆమధ్య అఖిల్ కోసం మిత్రన్ స్టోరీ రెడీ చేశారని.. ఈ కాంబోలో సినిమా ఖాయమని ప్రచారం జరిగింది. ఇప్పుడు చైతన్యతో మిత్రన్ సినిమా అంటూ కొత్తగా ప్రచారం జరుగుతుండడం ఆసక్తిగా మారింది. సర్థార్ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున రిలీజ్ చేశారు. అప్పటి నుంచి మిత్రన్ కు అన్నపూర్ణ కాంపౌండ్ తో మంచి అనుబంధం ఏర్పడింది. అందువలనే అక్కినేని హీరోలతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడట. సర్థార్ 2 రిలీజ్ తర్వాత చైతన్యతో సినిమా ఉంటుందని.. త్వరలో ప్రకటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి.. ఈ ప్రాజెక్ట్ నిజంగానే సెట్ అవుతుందో లేదో చూడాలి. Naga Chaitanya And mithran Movie.

Also Read: https://mega9tv.com/cinema/naga-vamsi-confident-about-kingdom-because-the-movie-is-gonna-release-after-1-week-of-veeramallu-release/