
టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రూపొందిన భారీ మల్టీస్టారర్ కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల డైరెక్టర్. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందిన కుబేర సినిమా కథ ఏంటి..? ఎలా ఉండబోతుంది అనేది ఇంత వరకు ఎక్కడా లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. జూన్ 20న కుబేర మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సందర్భంగా కుబేర మూవీ ఆడియో లాంచ్ ను గ్రాండ్ గా చెన్నైలో నిర్వహించారు. ఈ వేడుకలో నాగ్.. ధనుష్ కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ.. ధనుష్ కి నాగ్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి..?
నాగార్జునకు తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే.. పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ను ఇప్పుడు కాదు ఎప్పుడో సంపాదించుకున్నారు కింగ్ నాగార్జున. శివ, గీతాంజలి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించడంతో నాగ్ కు నాటి నుంచి తమిళ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. శివ, గీతాంజలి సినిమాలు తెలుగులో వలే తమిళ్ లో కూడా 100 రోజులు, 200 రోజులు 300 రోజులు.. కొన్ని ఏరియాల్లో అయితే.. సంవత్సరం కూడా ఆడడం విశేషం. ఈమధ్య కాలంలో ఊపిరి సినిమాతో తమిళ ఆడియన్స్ ను మరోసారి అలరించాడు.
ఇప్పుడు కుబేర సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ధనుష్ తో కలిసి నటించడంతో కుబేర సినిమా పై మరింత క్రేజ్ ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఆడియో లాంచ్ ఈవెంట్ లో నాగార్జునకు ఘనంగా వెల్ కమ్ చెప్పారు. ఈ వేడుకలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. కుబేర అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, ధనుష్ తప్ప ఈ క్యారెక్టర్ ను ఎవరూ చేయరు, చేయలేరని నాగార్జున అన్నారు. సోషియో పొలిటికల్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ కుబేర సినిమాతో ధనుష్ మరో నేషనల్ అవార్డు అందుకుంటారని నాగార్జున చెప్పడం విశేషం.
ధనుష్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. ధనుష్ ఒక రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ యాక్టర్ అని, అతనిలో ఎంతో టాలెంట్ ఉందని చెప్పారు. ధనుష్ నువ్వు నన్ను ఎప్పుడు డైరెక్ట్ చేస్తావని నాగార్జున ఈ సందర్భంగా అడగడం ఆసక్తిగా మారింది. ధనుష్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున.. తనని డైరెక్ట్ చేయని.. తనతో ఓ సినిమా చేయమని అడగడం.. ధనుష్ కు బంపర్ ఆఫరే. మరి.. నాగార్జున ఇచ్చిన ఆఫర్ ను ధనుష్ స్వీకరించి సినిమా తీస్తే.. ఆ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో మాంచి క్రేజ్ ఏర్పడడం ఖాయం. మరి.. నాగార్జున హీరోగా ధనుష్ డైరెక్షన్ లో సినిమా వస్తుందేమో చూడాలి.