కయాదు లోహర్ కు బర్త్ డే విషెస్ చెప్తూ ‘ది ప్యారడైజ్’ నుండి కొత్త పోస్టర్

Spread the love

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాదు… దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది. ‘దసరా’తో మాస్ ఇమేజ్ సంపాదించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు తదితరులు ఇతర  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు కూడా కీలక  పాత్రలో కనిపించబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన పాత్ర పేరు శికంజ మాలిక్… ఇంకా ఈ సినిమాలో అయన రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆగస్ట్ 21న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇక నేడు కయాదు లోహర్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ఆమె సుబ్బు అనే పాత్రలో కనిపించనున్నారు. ఇంకా ఈ సినిమా ఒక్క తెలుగు లోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీతో పాటు మొత్తం 8 భాషల్లో రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఇండిపెండెన్స్ డే  సందర్బంగా 2026లో రానున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న చిత్రంగా ‘ది ప్యారడైజ్’ పేరు వినిపిస్తోంది. అందుకే నాని కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో నానిని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా చూపిస్తున్నారు దర్శకుడు. ఇటీవల విడుదలైన “ఆయా షేర్” పాటతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. మాస్ స్టెప్పులతో నాని చేసిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అద్దుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య, అనిరుధ్ కలిసి ఆలపించారు. యూట్యూబ్‌లో ఈ సాంగ్ మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *