
Pawan Kalyan and Harish Shankar’s Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మూడు సినిమాలు హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూడు సినిమాల్లో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. ఒక ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసామని.. సెప్టెంబర్ 25న రావడం పక్కా అని మేకర్స్ ప్రకటించారు. మరి.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ.. ఉస్తాద్ అప్ డేట్ ఏంటి..? ఈ సినిమా వచ్చేది ఎప్పుడు..?
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్.. వీరిద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ ఎప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రేజీ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనౌన్స్ చేసినప్పుడు అభిమానులు తెగ సంబరపడ్డారు. అలాగే ఈ సినిమా కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ అయితే.. వేరే లెవల్లో ఉండడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఆతర్వాత పవన్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో షూటింగ్ లకు బ్రేక్ పడింది. అప్పుడు ఈ మూవీ ఉండదేమో అనే మాట కూడా వినిపించింది.
అయితే.. ఈ సినిమా షూట్ లో పవన్ పాల్గొన్నారని.. రాశీ ఖన్నా కూడా షూట్ లో జాయిన్ అయ్యిందని ఇటీవల వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఓ రెండు నెలల పాటు షూటింగ్ కి డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఈ సినిమా షూటింగ్ అయిపోయిందని పవన్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీరమల్లు మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసమని షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారని.. లేకపోతే ఈ నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ అయిపోయేదని చెప్పారు. ఇప్పుడు అదనంగా మరో మూడు నాలుగు రోజులు కేటాయిస్తున్నారట. Pawan Kalyan and Harish Shankar’s Ustad Bhagat Singh.
పవన్ చెప్పని మాటలను బట్టి.. మరో 10 రోజుల్లో షూటింగ్ అయిపోతుందని తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే పవన్ పై చాలా సన్నివేశాలను చిత్రీకరించేశాడట హరీష్ శంకర్. పవన్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం జెట్ స్పీడుతో షూటింగ్ చేశాడు. పక్కాగా ప్లాన్ రెడీ చేసుకుని హరీష్ శంకర్ ఉండడంతో అనుకున్న దానికంటే మరింత స్పీడుగా వర్క్ జరిగిందని సమాచారం. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడంటే.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి.. గబ్బర్ సింగ్ కాంబో మరోసారి మ్యాజిక్ ను ఏ రేంజ్ లో క్రియేట్ చేస్తారో చూడాలి.