వీరమల్లు న్యూ రిలీజ్ డేట్ ఇదే..!

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాని ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. అడగడుగునా అడ్డంకులే. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇన్ని సార్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత పోస్ట్ పోన్ అవ్వలేదు. ఎక్కువ సార్లు వాయిదాపడిన సినిమాగా వీరమల్లు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. అనుకున్నట్టుగానే వీరమల్లు మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. జూన్ 12న వీరమల్లు రావడం లేదు సరే.. మరి వీరమల్లు వచ్చేది ఎప్పుడు..? న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే.

వీరమల్లు పవన్ కళ్యాణ్‌ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమాని ప్రకటించినప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. క్రిష్‌ పవన్ ను ఎలా చూపిస్తాడా..? ఇందులో పవన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? ఫస్ట్ టైమ్ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు కదా.. ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉండేది. అయితే.. ఐదేళ్ల నుంచి ఈ సినిమా నిర్మాణంలో ఉండడం.. చాలా సార్లు వాయిదాపడడంతో చెప్పుకోదగ్గ బజ్ క్రియేట్ అవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా వస్తుందని జూన్ 12న విడుదల అని ప్రకటించి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రిలీజ్ కు ముందు థియేటర్స్ బంద్ అంటూ ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారని.. వీరమల్లు పై కుట్ర చేస్తున్నారని హాడావిడి చేయడం.. పవన్ సీరియస్ గా తీసుకోవడంతో సింపతీ క్రియేట్ అయ్యింది.

వీరమల్లు పై ఇప్పుడిప్పుడే బజ్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి టైమ్ లో వీరమల్లు మళ్లీ వాయిదా అంటూ ప్రచారం ప్రారంభం అయ్యింది. ఇదేదో గాసిప్ అనుకున్నారు కానీ.. ఆతర్వాత ఇదే నిజమని తెలిసింది. అఫిషియల్ గా వీరమల్లు జూన్ 12న రావడం లేదని.. విఎఫ్ఎక్స్ వర్క్ లో ఆలస్యం అవుతుండడం వలన మంచి క్వాలిటీ అవుట్ ఫుట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. న్యూ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. మరి.. వీరమల్లు ఎప్పుడు వస్తాడంటే.. జూన్ 20న రిలీజ్ చేద్దామంటే.. నాగ్, ధనుష్ ల కుబేర రిలీజ్ కి రెడీ అయ్యింది. పాన్ ఇండియా మూవీ.. అన్ని అగ్రిమెంట్స్ అయిపోయాయి. అందుచేత జూన్ 20న కుబేర పోస్ట్ పోన్ కాదు.. ఆ డేట్ కి వీరమల్లు రావడం కుదరదు.

జూన్ 27న రిలీజ్ చేద్దామంటే.. ఇప్పటికే కన్నప్ప ఒకసారి పోస్ట్ పోన్ అయ్యింది. మరోసారి పోస్ట్ పోన్ చేయలేను. జూన్ 27న కన్నప్ప రావడం పక్కా అంటున్నాడు మంచు విష్ణు. అందుచేత జూన్ 27న వీరమల్లు వచ్చే ఛాన్స్ లేదు. ఇక జులై 4న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా నిర్మాత నాగవంశీ. పవన్ అడిగితే ఈ డేట్ ను పవన్ కి ఇస్తారు కానీ.. ఆ డేట్ కు కూడా వీరమల్లు కంప్లీట్ కాదనే టాక్ వినిపిస్తోంది. జులై 11న అనుష్క ఘాటీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చలేరు. ప్రస్తుతానికి జులై 18న స్లాట్ ఖాళీగా ఉంది. ఇక జులై 25న నితిన్ తమ్ముడు సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నారు. పవన్ వీరమల్లు వస్తానంటే.. దిల్ రాజు ప్లాన్ మార్చుకుంటాడు. అందుచేత జులై 18 లేదా జులై 25న వీరమల్లు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. మరి.. వీరమల్లు రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.