
Power Star 2027 Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ఈ సినిమాల షూటింగ్ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు సినిమాల్లో వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూడు సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత పవర్ స్టార్ సినిమా చేస్తారా..? లేదా..? మరో సినిమా చేస్తే కనుక ఎప్పుడు ఉంటుంది..?
ఈ సంవత్సరంలో అంటే.. 2025లో పవన్ కళ్యాణ్ నుంచి హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటిక్స్ పైనే కాన్ సన్ ట్రేషన్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకనే ఈ మూడు సినిమాలను పూర్తి చేసేయాలని డిసైడ్ అయ్యారు. మరి.. పవన్ నెక్ట్స్ ఏంటి అంటే.. ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు.. ఎలాంటి ఇన్ సైడ్ న్యూస్ లేదు. అయితే.. ఓ మంచి కథ కుదిరితే.. భారీ చిత్రం చేయాలి అనుకుంటున్నారట. Power Star 2027 Movie.
పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ కోసం కథలు విన్నారని.. ఒకటి రెండు కథలు ఫైనల్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. నెక్ట్స్ ఇయర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినా 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ ఉంది. ఈసారి చేసే సినిమాలో ఎంటర్ టైన్మెంట్ తో పాటు సమాజానికి ఉపయోగపడే కథాంశం ఉండాలని ఫిక్స్ అయ్యారట. మేటర్ ఏంటంటే.. ఈ సినిమాతో తన భావజాలాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లేలా.. తన పార్టీకి ఉపయోగపడేలా ప్లాన్ చేయాలి అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూడు సినిమాలు రిలీజ్ తర్వాత.. మళ్లీ ఎన్నికలు వచ్చే లోపు ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఆ సినిమాను రెగ్యులర్ సినిమాలా కాకుండా భారీగా చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే.. ఆ ఒక్క సినిమాను ఎవరితో చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. పవన్ తో సినిమా చేయడానికి కొంత మంది దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. సముద్రఖని, సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్.. ఇలా లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉంది. వీరిలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా..? లేక వేరే డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దీని పై క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.