
Rajinikanth’s Coolie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్.. ఈ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ కూలీ. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచేశారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక టీజర్ ఎప్పుడు వస్తుంది..? ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు..? అని సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. టీజర్ అండ్ ట్రైలర్ విషయంలో ఓ ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. కూలీ క్రియేట్ చేసే నయా ట్రెండ్ ఏంటి..?
ఈ క్రేజీ మూవీలో కనీవినీ ఎరుగని విధంగా స్టార్ హీరోలు నటించడంతో తమిళ్, తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తమిళనాడు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని విధంగా భారీగా ఓపెనింగ్ రానుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ రోజునే ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వార్ 2 మూవీ వస్తున్నప్పటికీ.. రజినీ, నాగ్ కలిసి నటించడంతో కూలీ మూవీ క్రేజ్ ముందు నిలవడం కష్టమని ఫ్యాన్స్ అభిప్రాయం. ఇప్పటి వరకు కోలీవుడ్ కు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా రాలేదు. ఆ కలను కూలీ సినిమా నెరవేరుస్తుందని టాక్ బలంగా వినిపిస్తోంది. Rajinikanth’s Coolie.
ఇదిలా ఉంటే.. ఈ టీజర్ అండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలి అనుకోవడం లేదట. సినిమాను డైరెక్ట్ గా థియేటర్ లోనే చూడాలని ఇలా ప్లాన్ చేసారట మేకర్స్. ప్రస్తుతం దీని గురించే లోకేష్ కనకరాజ్ టీమ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారట. రజినీ, నాగ్, అమీర్ కాంబో చేతిలో ఉన్నప్పుడు టీజర్ అండ్ ట్రైలర్ ఎందుకు..? రిలీజ్ చేయాల్సిన అవసరం లేదని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఆలోచిస్తుందట. ప్రస్తుతం ఇది కోలీవుడ్, అండ్ టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఏ సినిమాకి అయినా టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు.. ఇప్పుడు కూలీ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నయా ట్రెండ్ క్రియేట్ చేసినట్టే.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై నెలాఖరున చెన్నైలో నెహ్రు స్టేడియంలో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆతర్వాత ఆగష్టు 7న కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేయాలి అనుకుంటున్నారట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైమ్ కి ట్రైలర్ పై క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా ఫరవాలేదు. మరింత క్రేజ్ పెరుగుతుంది కానీ.. ఏమాత్రం తగ్గదు. ఇందులో క్రేజీ హీరోయిన్ పూజా స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ వేరే లెవల్లో ఉంటుందని టాక్. ఏది ఏమైనా కూలీ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. కాకపోతే అది ఏ లెవల్లో ఉంటుంది అనేదే తెలియాల్సివుంది.