
Allu Arjun And Rashmika: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ హీరోయిన్ రష్మిక వీరిద్దరూ కలసి పుష్ప, పుష్ప 2 సినిమాలో నటించడం.. ఆ సినిమా చరిత్ర సృష్టించడం తెలిసిందే. దీంతో ఈ జంట మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారంటే.. పుష్ప 3లోనే నటిస్తారు అనుకున్నారు. అయితే.. పుష్ప 3 కంటే ముందుగానే ఈ హిట్ పెయిర్ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమివ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజంగానే పుష్పరాజ్, శ్రీవల్లి కలిసి నటించనున్నారా..? ఇంతకీ.. ఏ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు..?
పుష్ప ది రూల్ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో ఈ సినిమాను దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ కు ఇది 22వ చిత్రం కాగా అట్లీకి ఇది 6వ చిత్రం. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం నిర్మాణం ప్రారంభ దశలో ఉంది. నిర్మాతలు 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలను ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. బన్నీ, రష్మిక కలిసి పుష్ప 3 లో నటిస్తారు.. అంత వరకు వెయిట్ చేయాలి అనుకుంటే.. ఈలోపే కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఏ సినిమాలో అంటే.. అట్లీతో చేసే సినిమాలో బన్నీకి జంటగా రష్మికను తీసుకోవాలి అనుకుంటున్నారట. ఆల్రెడీ ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకునేని తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా షూట్ లో జాయిన్ కానుంది. అలాగే మరో బ్యూటీ మృణాల్ ఠాగూర్ కూడా ఈ సినిమాలో నటిస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను కూడా ఫైనల్ చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. Allu Arjun And Rashmika.
ఇప్పుడు రష్మిక పేరు వినిపిస్తుండడం ఆసక్తిగా మారింది. అట్లీ.. రష్మికను కాంటాక్ట్ చేసారని బాలీవుడ్ లో కూడా న్యూస్ వైరల్ అయ్యింది. ఓ కీలక పాత్ర కోసం రష్మికను సంప్రదించారని.. అయితే.. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ బన్నీ సినిమా కావడంతో డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటానని చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రష్మికనే కాకుండా భాగ్యశ్రీ బోర్సే ను కూడా కాంటాక్ట్ చేశారని చర్చ జరుగుతోంది. బన్నీ, రష్మిక గురించి వార్తలు వస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు కానీ.. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also Read: https://mega9tv.com/cinema/megastars-annayya-movie-item-song-will-be-remixed-in-vishwambhara/