
Rashmika future plan:ప్రొఫెషనల్ లైఫ్ని అలాగే పర్సనల్ లైఫ్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు రష్మిక చాలా ఓపెన్ గా సమాధానం చెప్పింది. ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. మనం ఓవర్ వర్క్ చేయడం నిజమే.. పరిస్థితుల వల్ల ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. కానీ ఒక మనిషికి ఎనిమిది నుంచి 10 గంటల వరకు నిద్ర అవసరం. అప్పుడే ఆ మనిషి హెల్తీగా ఉంటారు. మాకు కూడా వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటే చాలా బాగుంటుంది, 9 నుంచి 5 వరకు లేదా తొమ్మిది నుంచి ఆరు వరకు ఇలా వర్కింగ్ అవర్స్ నిర్ణయిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అన్నిసార్లు అది కుదరదు అని చెప్పుకొచ్చారు..
అలానే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ నేను నా ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నాను. పని ఒత్తిడి పర్సనల్ లైఫ్ మీద చూపించడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను వర్కౌట్ లు అలానే ఎక్కువ సమయం నిద్రపోవడం దాంతోపాటుగా నా ఫ్యామిలీకి నేను టైం కేటాయించడం ఇలాంటివన్నీ కూడా నేను జాగ్రత్తగా పాటించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ వల్ల భవిష్యత్తులో నేను ఎలాంటి ఇబ్బందులు పడాలి అని అనుకోవడం లేదు.. పశ్చాతాపానికి గురి అయ్యే పరిస్థితిలు తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పారు..Rashmika future plan
అలానే రష్మిక ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.. అదేంటంటే…”నేను ఇంకా తల్లిని కాలేదు కానీ భవిష్యత్తులో కచ్చితంగా తల్లిని అవుతాను… నాకు పిల్లలు పుడతారు.. వాళ్ల గురించి ఇప్పటినుంచి నేను ఆలోచిస్తున్నాను… వారికి మంచి జీవితం ఇవ్వాలని, వారిని సురక్షితంగా కాపాడుకోవాలని, వారికోసం హెల్తీగా ఉండాలి అని అనుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు రష్మిక. 20 నుంచి 30 ఏళ్లలో కష్టపడుతూనే ఉంటాం, 30 నుంచి 40 ఏళ్ల వయసులో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధిస్తాం.. ఇంకా 40 తర్వాత ఏమవుతుంది అనేది మన ఎవరికి తెలియదు కాబట్టి మన లైఫ్ని మనకు నచ్చినట్లుగా మనమే ప్లాన్ చేసుకోవాలి.. అంటూ చాలా కాన్ఫిడెంట్ గా తన ఫ్యూచర్ గురించి ఎలా ఉండాలో రష్మిక చెప్పుకొచ్చారు..” రష్మిక మాటలు విన్న ప్రతి ఒక్కరు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు..