
Sai Dharam Tej’s Sambarala yeti Gattu: మెగా హీరో సాయిదుర్గ తేజ్.. విరూపాక్ష, బ్రో చిత్రాల సక్సెస్ తర్వాత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తాడనుకుంటే.. స్పీడు తగ్గించాడు. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 25న ఈ సంబరాల ఏటిగట్టు రిలీజ్ కానున్నట్టుగా ప్రకటించారు కానీ.. ఇప్పుడు ఆ డేట్ కి రావడం లేదు. మరి.. తేజ్ సినిమా వచ్చేది ఎప్పుడు..?
సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే.. అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అందుచేత మేనమామ పవన్ సినిమా వస్తుందంటే.. మేనల్లుడు తేజ్ తన సినిమాను రిలీజ్ చేయడు. సెప్టెంబర్ లో రిలీజ్ కాకపోతే నెక్ట్స్ అక్టోబర్ లో రిలీజ్ చేయాలి. అయితే.. అక్టోబర్ లో ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు అని టాక్ వినిపిస్తోంది.
అక్టోబర్ 2న కాంతార చాఫ్టర్ 1, ఇడ్లీ కడాయ్ సినిమాలు వస్తున్నాయి. ఇక అక్టోబర్ మూడోవారంలో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా, కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వశిష్ట్ తెలియచేశారు. ఇదే జరిగితే.. తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేయడం కుదరకపోవచ్చు. అక్టోబర్ లో విడుదల చేయడం కుదరకపోతే.. నవంబర్ లో రిలీజ్ చేయాలి. అయితే.. నవంబర్ అనేది అన్ సీజన్. పైగా తేజ్ సినిమాని 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. Sai Dharam Tej’s Sambarala yeti Gattu.
ఇలాంటి భారీ సినిమా వర్కవుట్ అవ్వాలంటే.. మంచి డేట్.. మంచి సీజన్ చూసి రిలీజ్ చేయాలి. డిసెంబర్ లో రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది. అయితే.. డిసెంబర్ నెల అంతా ఆల్రెడీ బుక్ అయ్యింది. ఇక సంక్రాంతి చిరంజీవి, రవితేజ, నవీన్ పొలిశెట్టి, తమిళ హీరో విజయ్ సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మళ్లీ ఫిబ్రవరి, మార్చి నెల అంటే లేట్ అవుతుంది పైగా ఎగ్జామ్స్ సీజన్.. సమ్మర్ వరకు ఆగడం అంటే నిర్మాతకు చాలా కష్టం. అందుచేత ఈ ఇయర్ లోనే సంబరాల ఏటిగట్టు థియేటర్స్ లోకి రావాలి. మరి.. ఈ భారీ చిత్రం మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? ఎప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు..? అనేది ఆసక్తిగా మారింది. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read: https://mega9tv.com/cinema/these-are-the-exciting-updates-of-charan-and-ntrs-movies/