సీపీ సజ్జనార్ కు చిన్మయి ఫిర్యాదు..

Spread the love

Singer Chinmayi issue:ప్రముఖ గాయిని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా లో నిత్యం ట్రోలింగ్స్ కి గురవుతున్నారు అని చెప్పాలి.మహిళల పై ఎవరైనా అనుచితంగా మాట్లాడితే చిన్మయి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వుంటారు.నెటిజన్లు కూడా తనపై ఎప్పుడు కామెంట్స్ చేస్తూ వుంటారు.ఈ సరి మాత్రం ట్రోలర్స్ తమ హద్దులు దాటి మరి సింగర్ చిన్మయి ని వేధిస్తున్నారు.ఇంత దారుణంగా ట్రోల్ చేయడానికి తన భర్త రాహుల్ రవీంద్రన్ ఏ కారణం అయ్యారు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ నవంబర్ 7 న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.దీంతో మూవీ టీం అంతా కూడా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు.వరుసగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో వున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేసారు. రాహుల్ మాట్లాడుతూ..”మంగళ సూత్రం ధరించాలా ? వద్దా ? అనేది పూర్తిగా తన భార్య అయిన చిన్మయి ఇష్టం అని, ఆ విషయంలో తనని నేను ఫోర్స్ చేయను..”అంటూ చెప్పుకొచ్చారు. దీంతో మంగళసూత్రం గురించి ఈ విధముగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని నెటిజెన్స్ రాహుల్ పై విరుచుకుపడుతున్నారు.Singer Chinmayi issue

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాహుల్ తో పాటు చిన్మయిని, తమ పిల్లల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. ఏకంగా పిల్లల్ని చనిపోవాలి అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు.దీంతో సింగర్ చిన్మయి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.హైదరాబాద్ సీపీ సజ్జనార్ కి ఒక ఫిర్యాదును పంపించారు చిన్మయి.తనని, తన పిల్లల్ని హింసిస్తున్నారంటూ, కనీసం పలకడానికి కూడా వీలు లేని పదాలతో ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసింది చిన్మయి. ట్రోలింగ్స్ కొత్త ఏమి కాకపోయినా ఈ సరి పరిమితికి మించి ఉండటంతో చిన్మయి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది అని తమ సన్నిహితులు చెప్తున్నారు.మరి ఈ ఫిర్యాదు పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏ విధంగా చర్య తీసుకుంటారు అనేది వేచి చూడాలి.