
National Award For Bhagavanth Kesari: జాతీయ అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ.. తెలుగు సినిమాకి అన్యాయం జరుగుతుందని.. అవార్డులు దక్కించుకోవడంలో వెనకబడిందని.. వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా గట్టిగానే ప్రభావం చూపించింది. ఇండియన్ సినిమా గురించి.. తెలుగు సినిమా ప్రస్తావన లేకుండా మాట్లాడుకోవడం లేదు. అది కలెక్షన్స్ అయినా.. అవార్డులైనా.. 71వ జాతీయ అవార్డుల్లో ఇది రుజువైంది. మరి.. ఈసారి ఏ ఏ తెలుగు సినిమాకి అవార్డులు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తమ తెలుగు సినిమాగా భగవంత్ కేసరిని ఎంపిక చేశారు. ఇందులో బాలయ్య హీరోగా నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇది మాస్ కమర్షియల్ సినిమానే అయినప్పటికీ.. ఆడపిల్ల పెంపకం గురించి వాళ్ల విశిష్టత గురించి చెప్పిన కథ ఇది. దీనికి బనావ్ బేటీకో షేర్ అనే స్లోగన్ గట్టిగా వినిపించారు. ఈ కాన్సెప్ట్ జ్యూరీకి నచ్చి ఉంటుంది. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపింంచిన హను -మాన్ సినిమాకు కూడా జాతీయ అవార్డుల్లో తగిన గౌరవం దక్కింది. విజువల్ ఎఫెక్ట్స్, కొరియోగ్రఫీ విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది.
ఇక చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన సినిమా బేబీ. ఈ సినిమా ఖాతాలో రెండు అవార్డులు పడ్డాయి. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేష్ అవార్డు అందుకోబోతున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు కూడా బేబీ చిత్రానికే దక్కింది. గాంధీ తాత చెట్టు చిత్రానికి గానూ ఉత్తమ బాల నటిగా సుకుమార్ కుమార్తె కృతి ఎంపికైంది. బలగం సినిమాలో ఊరు.. పల్లెటూరు పాట రాసిన కాశర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా జ్యూరీ ఎంచుకొంది. శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల అశోక్ తేజ తర్వాత గీత రచయితగా జాతీయ అవార్డ్ అందుకున్న ఘనత కాసర్ల శ్యామ్ కు దక్కింది. National Award For Bhagavanth Kesari.
సార్ చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అయితే తమిళ వెర్షన్‌కు ఈ గుర్తింపు దక్కింది. బలగం చిత్రానికి మరిన్ని అవార్డులు దక్కాల్సిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇక ఉత్తమ సంగీత దర్శకుడుగా యానిమల్ మూవీకి లభించింది. ఈ సినిమాకి సంగీతం అందించిన హర్షవర్థన్ రామేశ్వర్ తెలుగువాడే. ఇలా తెలుగు సినిమా జాతీయ అవార్డుల్లో సత్తా చూపించింది. ఈ విధంగా తెలుగు సినిమా జాతీయ స్థాయిలో సత్తా చూపించడంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖలు అభినందనలు తెలియచేస్తున్నారు.
Also Read: https://mega9tv.com/cinema/rajinikanths-coolie-og-glimpse/