బుల్లితెర పై అదరగొట్టిన తండేల్..!

Spread the love

Chaitanya’s Thandel 100 Crores: నాగ చైతన్య కెరీర్ లో మరచిపోలేని సినిమా తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది చైతన్య ఫస్ట్ 100 కోట్ల మూవీ కావడంతో ఫుల్ జోష్ తో నెక్ట్స్ మూవీస్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్ లో భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్టే 100 కోట్లు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. తండేల్ సినిమా బుల్లితెర పైకి వచ్చింది. వెండితెర మీదే కాదు.. బుల్లితెర పై కూడా అదరగొట్టిందని తెలిసింది. ఇంతకీ.. తండేల్ టీఆర్పీ రేటింగ్ ఎంత..? ఏ ప్లేస్ లో నిలిచింది..?

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న భారీ స్థాయిలో రిలీజైంది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఫిబ్రవరి నెల అంటే అన్ సీజన్. అయినప్పటికీ థియేటర్లు కళకళలాడేలా చేసింది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలు తీసుకువచ్చింది. అయితే.. బుల్లితెర పై తండేల్ కు బాగానే టీఆర్పీ రేటింగ్ వస్తుంది అనుకున్నారు కానీ.. అంచనాలకు మించిన రేటింగ్ రావడం హాట్ టాపిక్ అయ్యింది. టీవీ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం తండేల్ టెలివిజన్ ప్రీమియర్ 10.32 రేటింగ్ తెచ్చుకుంది. ఈ సంవత్సరం ఇలా డబుల్ డిజిటల్ తెచ్చుకున్న సినిమాలు రెండే రెండు ఉన్నాయి.

విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 15.92 తో నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా పుష్ప 2 ది రూల్ 12.61 తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పుడు తండేల్ సినిమా మూడో స్థానంలో నిలవడం విశేషం. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలతో పోలిస్తే.. చైతూ మూవీ తండేల్ థియేట్రికల్ గా బాగా ఆడింది కానీ.. మరీ అంత భీభత్సంగా ఆడలేదనేది నిజంగా నిజం. అయినా ఈ రెండు సంచలన చిత్రాలతో పోటీపడేలా టీఆర్పీ రేటింగ్ దక్కించుకోవడం ఆసక్తిగా మారింది. చైతూ, సాయిపల్లవి పర్ ఫార్మెన్స్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమా జనాలకు బాగా రీచ్ కావడానికి బాగా హెల్ప్ అయ్యింది. Chaitanya’s Thandel 100 Crores.

ప్రస్తుతం శాటిలైట్ మార్కెట్ అంత బాలేదు. ఈ మార్కెట్ పడిపోతుందని నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో తండేల్ ఊహించని విధంగా మంచి టీఆర్పీ రేటింగ్ సాధించి ఉత్సాహాన్ని నింపింది. ఓటీటీలో నెల రోజులకే సినిమాలు వచ్చేస్తుండడం.. అందులో యాడ్స్ లేకుండా ప్రసారం అవుతుండడంతో టీవీలో సినిమాలు చూడడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇలాంటి టైమ్ లో తండేల్ మాత్రం అద్భుతంగా బుల్లితెర పై రికార్డ్ రేటింగ్ సాధించి అటు నిర్మాతలకు, ఇటు అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. వెండితెర మీదే కాదు.. బుల్లితెర పై కూడా తండేల్ రాజు సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం.

Also Read: https://mega9tv.com/cinema/shruti-haasans-sensational-comments-about-power-star-who-used-to-talk-about-agriculture-and-rural-people/