మెగాస్టార్ విశ్వంభర స్టోరీ ఇదే!

Spread the love

Megastar Vishwambhara movie: విశ్వంభర.. మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తోన్న సినిమా ఇది. ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీకి మల్లిడి వశిష్ట్ డైరెక్టర్. ఈ సినిమాని ప్రకటించినప్పుడు విశ్వంభర కథ ఇదే అంటూ రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. ఇప్పుడు విశ్వంభర కథ గురించి క్లారిటీ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే.. విశ్వంభర సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ.. విశ్వంభర కథ ఏంటి..? ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ చూడాల్సిందే.

విశ్వంభర సినిమా కథ గురించి సింపుల్ గా చెప్పాలంటే.. చిరంజీవి.. తన కథానాయికను వెతుక్కుంటూ విశ్వంభర అనే లోకానికి వెళతాడట. అక్కడ నుంచి కథానాయికను ఎలా భూమి మీదకు తీసుకువచ్చాడు అనేదే మిగిలిన కథ. అయితే.. ఇందులో ప్రతి సీన్ చాలా డిఫరెంట్ గా.. వావ్ అనిపించే విజువల్స్ తో ఉంటుందట. ఈ సినిమా కథ గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదేమో ఇదేదో గాసిప్ అనుకుంటే పొరపాటే. ఇది నిజంగా నిజం. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెలియచేశారు. కథ ఏంటి..? అనేది క్లారిటీ వచ్చింది. మరి.. రిలీజ్ ఎప్పుడంటే.. దీనికి కూడా వశిష్ట్ క్లారిటీ ఇచ్చాడు.

ఇంతకీ ఏం చెప్పాడంటే.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ ను త్వరలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. ఈ సాంగ్ ఆట కావాలా పాట కావాలా సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చేశాడు డైరెక్టర్ వశిష్ట్. ఈ పాటను జూలై 25 నుంచి మొదలుపెట్టి గుమ్మడికాయ కొట్టేందుకు రెడీ అవుతున్నారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. అక్టోబర్ లో విశ్వంభర సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా అసలు విషయం బయటపెట్టారు విశ్వంభర డైరెక్టర్. Megastar Vishwambhara movie.

ఈమధ్య విశ్వంభర సెప్టెంబర్ లో రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది. అంతే కాకుండా.. అఖండ 2, ఓజీ ఈ రెండు సినిమాల కంటే ముందుగా సెప్టెంబర్ 18న రిలీజ్ అంటూ రిలీజ్ డేట్ కూడా వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు వశిష్ట్ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడింది. ఇప్పటి వరకు అక్టోబర్ నెలలో థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా ఒకటే. రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా కూడా ఆ ఆప్షన్ వైపు చూస్తోంది. కాంతార ప్రీక్వెల్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో రానుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ ఫైనల్ కట్ అయ్యాక చిరంజీవితో పాటు టీమ్ మొత్తం సంతృప్తి చెందాలి. బాగుంది అనుకుంటే.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారని సమాచారం. మరి.. చిరు బర్త్ డేకి విశ్వంభర రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/rajamouli-changes-plan-for-mahesh-movie-and-oscar-plan-for-mahesh-movie-get-scrapped/