త్రివిక్రమ్, బన్నీ మూవీ ఇప్పట్లో లేనట్టేనా..?

Spread the love

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. గుంటూరు కారం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి కానీ.. కొన్ని కారణాల వలన సెట్ కాలేదు. ఆతర్వాత చాలా ప్రాజెక్టులు అనుకుని పైనల్ గా వెంకీతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించనున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా ఉంటుందని అంతా అనుకుంటున్నారు కానీ.. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మూవీ ఇప్పట్లో ఉండదనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇదే కనుక నిజమైతే.. త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి..? వెంకీతో మూవీ తర్వాత ఎవరితో సినిమా ఉంటుంది..?

త్రివిక్రమ్ శ్రీనివాస్.. వెంకీతో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు కథ – మాటలు అందించారు. అప్పటి నుంచి త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యింది. ఆ రెండు సినిమాల తరహాలో ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది కానీ.. అలాంటిది లేదనేది ఇన్ సైడ్ లీక్. ఇప్పటి నుంచే త్రివిక్రమ్ రెండు ప్రాజెక్టులకు సంబంధించి స్టోరీలు రెడీ చేస్తున్నాడట.

మరి.. ఎవరితో సినిమా చేస్తాడంటే.. వెంకీతో సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కానీ.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కానీ.. సినిమా ఉంటుందని తెలిసింది. ఇటీవల చరణ్‌, త్రివిక్రమ్ మధ్య కథాచర్చలు జరిగాయి. ఎప్పటి నుంచో ఈ కాంబో సెట్ చేయాలని కొంత మంది నిర్మాతలు ట్రై చేశారు కానీ.. వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ కలయికలో మూవీ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలాగే పవన్, త్రివిక్రమ్.. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ప్రస్తుతం చేస్తోన్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల తర్వాత పవన్.. త్రివిక్రమ్ తో సినిమా చేసే ప్లానింగ్ జరుగుతుందట. ఈ లెక్కన బన్నీ, త్రివిక్రమ్ మూవీ ఇప్పట్లో లేనట్టే. మరి… ఏం జరగనుందో చూడాలి.