
Sandeep Reddy Vanga’s Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమాను అనౌన్స్ చేయడం తెలిసిందే. ఈ సినిమాని ప్రకటించారు కానీ.. ఇంత వరకు పట్టాలెక్కలేదు. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే.. ఎప్పుడెప్పుడు ఈ మూవీ స్టార్ట్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. స్పిరిట్ మూవీ గురించి హీరో విజయ్ దేవరకొండ అప్ డేట్ ఇవ్వడం విశేషం. అదేంటి.. ప్రభాస్ స్పిరిట్ గురించి విజయ్ అప్ డేట్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా..?
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ.. కొన్ని కారణాల వలన వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ నెల 31న రిలీజ్ కి రెడీ అయ్యింది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండను, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇంటర్ వ్యూ చేశాడు. ఈ ఇంటర్ వ్యూలో కింగ్ డమ్ సినిమాకి సంబంధించిన చిత్ర విశేషాలను తెలియచేశారు. అలాగే ఖచ్చితంగా కింగ్ డమ్ సినిమా విజయ్ కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తుందని సందీప్ తెలియచేశాడు. Sandeep Reddy Vanga’s Spirit.
ఇక ఈ ఇంటర్ వ్యూ చివరిలో.. స్పిరిట్ అప్ డేట్ ఇవ్వకపోతే డార్లింగ్ ఫ్యాన్స్ ఫీలవుతారు.. స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావ్ అని విజయ్ దేవరకొండ అడిగితే.. సందీప్ రెడ్డి వంగ.. సెప్టెంబర్ నెలాఖరు నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పాడు. అలాగే సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఈ మూవీ షూట్ కంప్లీట్ అయ్యే వరకు నాన్ స్టాప్ గా చేస్తానని కూడా సందీప్ తెలియచేయడం విశేషం. దీనిని బట్టి సందీప్ పక్కా ప్లాన్ రెడీ చేశాడు.. ఇక ప్రభాస్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం. వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాడు. ఈ వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే విలన్ క్యారెక్టర్ కోసం హాలీవుడ్ స్టార్స్ ను రంగంలోకి దింపనున్నారని తెలిసింది. ఇప్పటి వరకు ప్రభాస్ ను ఎవరూ చూపించని విధంగా చాలా పవర్ ఫుల్ గా చూపిస్తారనే టాక్ బలంగా వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి వంగ ఎంతటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ మాత్రమే కాదు.. దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పడం విశేషం. మరి.. స్పిరిట్ తో ప్రభాస్, సందీప్ చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.